Begin typing your search above and press return to search.

ఖర్చు దండగ అన్న జగన్ మాట నాన్సెన్స్ అన్న గులాబీ నేత

By:  Tupaki Desk   |   28 Jan 2020 9:59 AM GMT
ఖర్చు దండగ అన్న జగన్ మాట నాన్సెన్స్ అన్న గులాబీ నేత
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టారు టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే. ఏపీ శాసన మండలికి సంబంధించిన జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్న మాటతో పాటు.. ఆయన మాటలు అర్థం లేనివిగా కొట్టి పారేశారు. మండలి మీద పెట్టే రూపాయి ఖర్చు అయినా దండగేనన్న ఆయన మాటలపై కేకే రియాక్ట్ అయ్యారు.

ఏపీ శాసనమండలి రద్దు చేయటం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మండలి పై పెట్టే ఖర్చు రూపాయి అయినా దండగే అన్న మాట నాన్సెన్స్ అని పేర్కొన్నారు. పెద్దల సభ ఎంతో ముఖ్యమన్న ఆయన.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ కమిషనర్ నాగిరెడ్డి ని కలిశారు.

తాజాగా ఆయన ఎమ్మెల్సీ ఓటు మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో కేకే ఏపీ నుంచి ఎన్నికయ్యారు. అదే సమయం లో కాంగ్రెస్ నేత కేవీపీ రామ చంద్రరావు తెలంగాణ నుంచి ఎంపికయ్యారు. విభజన తర్వాత కేకే.. కేవీపీలు పరస్పరం రాష్ట్రాలు మార్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు అదే విషయాన్ని చెబుతున్నారు కేకే. తాను.. కేవీపీ ఇద్దరం పరస్పరం రాష్ట్రాలు మార్చుకున్నామని.. అందుకు తగ్గట్లే నాటి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్ ఆదేశాలు కూడా ఇచ్చారన్నారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైందని గుర్తు చేశారు.

కేవీపీకి తెలంగాణ లో సాధారణ ఓటు హక్కు కూడా లేదన్న కేకే.. తాను మాత్రం ఓటేశానని.. మరి కేవీపీ ఓటు వేస్తారో లేదో అన్నది ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలన్నారు. తాను తుక్కుగూడ మున్సిపాలిటీ లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటేసిన వైనంపై కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘాన్ని కలిసి వివరణ ఇచ్చారు. మరి.. కేకే మాటలపై కేవీపీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎంతైనా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా గెలవని కేకేకు పెద్దల సభ మీద అభిమానం ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు.