Begin typing your search above and press return to search.
ఔర్ ఏక్ బార్.. కేకే బరాబర్
By: Tupaki Desk | 10 March 2020 6:17 AM GMTఏదైనా జట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసుకునే ఏపీ సీఎం జగన్ తాజా గా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నలుగురిని నామినేట్ చేశారు. అయితే పక్కనున్న తెలంగాణలో కేసీఆర్ ఇప్పటివరకూ ప్రకటించలేదు.
తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. అందులో ఒక సీటుకు కేసీఆర్ తన కూతురు కవితకు ఇస్తారనే ప్రచారం సాగింది. ఇక రెండో సీటును ఎవరికి ఇస్తారనేది ఆసక్తిగా మారింది.
టీఆర్ఎస్ కు పెద్ద దిక్కు.. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కే కేశవరావు కు ఈసారి రాజ్యసభ సీటు రాదనే ప్రచారం సాగింది. ఇప్పటికే రెండు సార్లు కేకే రాజ్యసభకు వెళ్లారు. కాంగ్రెస్ లో నుంచి టీఆర్ఎస్ లో చేరగానే కేసీఆర్ కేకేను రాజ్యసభకు పంపారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో సెక్రెటరీ జనరల్ గా ఉన్నారు. కేసీఆర్ పక్కనే కూర్చుంటారు.
అయితే కేకే సీనియారిటీ, గౌరవం దృష్ట్యా మరోసారి కేకేను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేకే కు కేసీఆర్ రాజ్యసభ సీటుపై స్పష్టమైన సమాచారం అందించినట్టు తెలుస్తోంది.
అయితే రాజకీయాల్లో ఎవ్వరూ ఊహించని స్టెప్ వేసే కేసీఆర్ ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తారనేది డౌట్ గా మారింది. మరి కేకేకు రాజ్యసభ సీటు ఇస్తారా? లేదా అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. అయితే టీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేకే కు ఖాయమంటున్నాయి.