Begin typing your search above and press return to search.
ధరేమో ఎక్కువ.. ఆటేమో తక్కువ.. ఆ ఫారిన్ ఆటగాడి పై కేకేఆర్ అసంతృప్తి
By: Tupaki Desk | 25 Sep 2020 1:30 AM GMTఐపీఎల్ మొదలై 13 ఏళ్ళు అయింది. ఇందులో చరిత్ర చూస్తే అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు ఎవరూ ఆయా సీజన్లలో రాణించింది లేదు. గతంలో గేల్, యువరాజ్ సింగ్, బౌలర్ ఉనాద్కత్, క్రిస్ లీన్ పేలవంగా ఆడారు. తాజాగా వీరి జాబితాలో ప్యాట్ కమ్మిన్స్ చేరారు. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అతడు విరాట్ కోహ్లీ రూ. 17 కోట్లు తర్వాత వేలంలో రూ. 15.5 కోట్లు పలికిన ఆటగాడు. టెస్టుల్లో నంబర్ వన్ అయిన ఈ ఆస్ట్రేలియా ఆటగాడిని దక్కించుకునేందుకు చాలా జట్లు ప్రయత్నించగా..చివరికి కోల్ కతా నైట్ రైడర్స్ రూ.15.5 కోట్ల భారీ మొత్తం చెల్లించి అతన్ని సొంతం చేసుకుంది. జట్టులో బౌలింగ్ బలం అంత పటిష్టంగా లేకపోవడంతో అతనిపై యాజమాన్యం భారీ ఆశలే పెట్టుకుంది. కానీ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు తేలిపోయాడు.
కొత్త కుర్రాడు శివ మావి వంటి ఆటగాడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 32 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్యాట్ కమ్మిన్స్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 49 పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్ లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఎడాపెడా బౌండరీలు బాదారు. కమ్మిన్స్ ఒక్కో ఓవర్ కు 16.3 చొప్పున పరుగులు ఇచ్చాడు. ఆల్ రౌండర్లు, స్థానిక ఆటగాళ్ల స్థాయిలో కూడా ప్యాట్ కమ్మిన్స్ రాణించిక పోవడంతో కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. అంత భారీ స్థాయిలో అతని పై డబ్బుపెట్టి నష్టపోయామని భావిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడైనా అంతే. డబ్బు ఎక్కువ పోసిన ఆటగాళ్లు సక్సెస్ అయ్యింది తక్కువ. యువరాజ్ సింగ్ ను ఏకంగా బెంగళూరు రూ. 16 కోట్లు చెల్లించి తీసుకుంటే అతడు ఎటువంటి ప్రభావం చూపకపోవడంతో మరుసటి ఏడాదే రాయల్స్ అతడిని వదులుకుంది. గేల్ విషయంలోనూ ఇలాగే చేసింది బెంగళూరు. బౌలర్ ఉనాద్కత్ కూడా రూ. 13 కోట్లకు అమ్ముడు పోయినా ఐపీఎల్లో ఒక్కసారి కూడా ప్రభావం చూపింది లేదు. మెక్కల్లమ్, డివిలియర్స్, దినేష్ కార్తీక్ కూడా కొన్ని సీజన్లలో భారీ మొత్తంలో అందుకున్నా సరైన ప్రదర్శన చేసింది లేదు.