Begin typing your search above and press return to search.

స్కోర్​ పై ఓ అంచనా లేదు.. అందుకే పంజాబ్​ విఫలం..!

By:  Tupaki Desk   |   27 April 2021 4:34 AM GMT
స్కోర్​ పై ఓ అంచనా లేదు.. అందుకే పంజాబ్​ విఫలం..!
X
భారీ అంచనాలతో బ్యాటింగ్​ కు దిగి పంజాబ్​ కింగ్స్​ జట్టు విఫలమవుతుందని మాజీ క్రికెటర్​ ప్రజ్ఞాన్​ ఓజా అభిప్రాయపడ్డాడు. బ్యాట్స్​మెన్​ పై అనవసర ఒత్తిడి పెంచుతున్నారని పేర్కొన్నారు. ప్రతి సారి 180, 190 పరుగుల లక్ష్యంతోనే పంజాబ్​ బ్యాటింగ్​కు దిగుతోందని ఇది ఏ మాత్రం సరికాదని ఆయన చెప్పాడు. ‘నికోలస్​ పూరన్​, క్రిస్​ గేల్​ అద్భుతమైన ఆటగాళ్లు.. కానీ వాళ్లను సరిగ్గా ఉపయోగించుకోవడంలో పంజాబ్​ విఫలమవుతోంది. పూరన్​ మీద అనవసరపు ఒత్తిడిని పెంచుతున్నారు.

నిజానికి పూరన్​ డ్యాషింగ్​ బ్యాట్స్​మెన్​. అతడి స్ట్రయిక్​ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ భారీ స్కోరు చేయాలంటూ అతడిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో అతడు వెంట వెంటనే వెనుదిరుగుతున్నాడు. ఓపెనర్లు రాహుల్​, మయాంక్​ ఓ స్పష్టమైన ఇన్సింగ్స్​ ఆడాక.. నికోలస్​ పూరన్​, గేల్​ పై ఎటువంటి ఒత్తిడి లేక పోతే వాళ్లు మంచి స్కోరు తీసుకొస్తారు.

గత ఐపీఎల్​ సీజన్​ లో మ్యాక్స్​వెల్​ పంజాబ్​ తరఫున ఆడాడు. అతడిపై తీవ్రమైన ఒత్తిడి ఉండేది. దీంతో సరిగ్గా ఆడలేకపోయాడు. ప్రస్తుతం క్రిస్​గేల్​, పూరన్​ మీద కూడా అటువంటి ఒత్తిడే ఉంది. ప్రతి బ్యాట్స్​మెన్​ కు ఓ సహజసిద్ధమైన బ్యాటింగ్​ స్టయిల్​ ఉంటుంది. వాళ్లను ఆ లైన్​ లోనే ఆడనివ్వాలి. అంతేకాని వాళ్ల మీద అనవసర ఒత్తిడి తీసుకొస్తే అసలుకే మోసం వస్తుంది. నికోలస్​ పూరన్​, గేల్​ విషయంలో అదే జరుగుతోంది.

జట్టు కెప్టెన్​, సూచన మేరకు వాళ్లు దూకుడు తగ్గించి నెమ్మదిగా ఆడేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఒత్తిడికి లోనయి పెవిలియన్​ బాట పడుతున్నారు’ అని ఓజా పేర్కొన్నారు. సోమవారం పంజాబ్​ కింగ్స్​ జట్టు.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తో తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్​ లో పంజాబ్​ బ్యాట్స్​మెన్​ ఘోరంగా విఫలమయ్యారు. ఆరంభంలోనే రాహుల్​ అవుటయ్యాడు.

ఆ తర్వాత క్రిస్​ గేల్​ కూడా డకౌట్​ అయ్యాడు. మయాంక్​ అగర్వాల్​, నికోలస్​ పూరన్​ మీద తీవ్రమైన ఒత్తిడి పడింది. ఈ క్రమంలో వాళ్లు కూడా వెనువెంటనే వెనుదిరిగారు. మయాంక్​ 31 పరుగులు, జోర్డాన్​ 30 పరుగులు మినహా.. పంజాబ్​ జట్టులో ఎవరూ ఆశించిన మేర రాణించలేదు. దీంతో కేవలం ఆ జట్టు 123 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రారంభం లో తడబడ్డ కోల్​కతా నైట్​ రైడర్స్​ మోర్గాన్​, రాహుల్​ త్రిపాఠి మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతో కేవలం కోల్‌కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.