Begin typing your search above and press return to search.
బాలీవుడ్ భామను పెళ్లాడబోతున్న ఇండియన్ క్రికెటర్!
By: Tupaki Desk | 12 July 2022 8:18 AM GMTటీమిండియా డాషింగ్ బ్యాట్సమన్ కేఎల్ రాహుల్.. బాలీవుడ్ భామ అతియా శెట్టిల వివాహానికి తెర లేవబోతోంది. గత కొంతకాలంగా అతియా శెట్టితో కేఎల్ రాహుల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని వీరిద్దరూ ప్రకటించారు. లండన్ లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీరిద్దరి ఫొటోలు ఇనస్టాగ్రామ్ లో వచ్చినా వీరిద్దరూ స్పందించలేదు. అయితే అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ ఒకప్పటి కండల హీరో సునీల్ శెట్టి మాత్రం స్పందించాడు. అతియా, రాహుల్ మంచి ఫ్రెండ్స్ అని.. వారిద్దరూ పెళ్లి చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఈ నేపథ్యంలో అతియా, రాహుల్ తమ చిరకాల స్నేహబంధాన్ని మూడుముళ్ల బంధంతో ఒక్కటి చేయడానికి నిర్ణయించుకున్నారని బాలీవుడ్ టాక్. మరో మూడు నెలల్లో వీరిద్దరూ పెళ్లి పీఠలెక్కబోతున్నాడని సమాచారం. పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకునేందుకు రాహుల్ తల్లిదండ్రులు ఇటీవలే అతియా తండ్రి సునీల్ శెట్టిని కలిశారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
ఈ రెండు కుటుంబాలు కలిసి రాహుల్-అతియా జంట పెళ్లి తర్వాత ఉండబోయే కొత్త ఇంటిని కూడా చూశారని తెలుస్తోంది. ఈ ఇల్లు ముంబైలో అరేబియా సముద్రం ఒడ్డున ఉందని అంటున్నారు. అక్కడే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ అతియానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.
కాగా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు గాయపడ్డ లోకేశ్ రాహుల్ ప్రస్తుతం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం రాహుల్ చికిత్స కోసం జర్మనీలో ఉండగా.. ప్రేయసి అతియా కూడా అతడితోనే గడుపుతోంది. రాహుల్ గాయం నుంచి కోలుకునేందుకు మరో నెల రోజులు పడుతుందని, అప్పటి వరకు అతియా కూడా రాహుల్‌తోనే ఉంటుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా అతియా సోదరుడు అహాన్ శెట్టి అరంగేట్ర సినిమా 'తడప్' ప్రీమియర్ సందర్భంగా రాహుల్-అతియాలు తొలిసారి తమ ప్రేమ వ్యవహారాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. టీమిండియా తదుపరి కెప్టెన్ రేసులో ఉన్న రాహుల్.. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు. మరోవైపు సునీల్ శెట్టి గారాలపట్టి అతియా శెట్టి బాలీవుడ్ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.