Begin typing your search above and press return to search.
కేటీఆర్ బర్త్ డే మొత్తానికి హైలెట్ ఏమిటంటే..
By: Tupaki Desk | 25 July 2016 7:12 AM GMTతెలంగాణ రాష్ట్ర సాధకుడు కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ రేంజ్ ఏమిటో నిన్న చాలామందికి అర్థమై ఉండాలి. మీడియాలో పెద్దగా ఫోకస్ కాని ఈ అంశం రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చకు దారి తీసింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ.. విడిపోయిన తర్వాత ఇప్పటివరకూ ఏ రాజకీయ నాయకుడి పుట్టినరోజుకి జరగనంత భారీగా.. ట్రెండీగా.. వెరైటీగా కేటీఆర్ బర్త్ డే సందర్భంగా చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఫ్యూచర్ సీఎంగా అభివర్ణించే కేటీఆర్ ను సర్ ప్రైజ్ చేయాలని అనుకున్నారో.. లేకుంటే ఇప్పటివరకూ ఎవరూ చేయని రీతిలో చేయాలని భావించారో కానీ కేఎం ప్రతాప్ ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మూడు బుల్లి విమానాల్లో ఆయన కేసీఆర్ నివాసం మీదా.. కేటీఆర్ ఇంటి మీదా.. తెలంగాణ భవన్.. బుద్ధ విగ్రహం.. అంబేడ్కర్ విగ్రహం మీదా భారీ ఎత్తున పూలు జల్లించే ఏర్పాటు చేశారు. ఒక రాజకీయ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా మూడు చాఫ్టర్ ఫ్లైట్లను ఉపయోగించి పూలు చల్లించిన వైనం తెలుగు రాష్ట్రాల్లో లేదనే చెప్పాలి. అయితే.. ఈ తరహా ఏర్పాట్ల కారణంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఆడంబరాలకు తన మిత్రులు.. సన్నిహితులు పోకుండా కేటీఆర్ కంట్రోల్ చేయాలని.. లేకుంటే వారి ఉత్సాహం ఆయనకు శాపంగా మారుతుందన్న వ్యాఖ్యలు టీఆర్ ఎస్ సీనియర్ నేతల్లో కొద్దిమంది లోగుట్టుగా వ్యాఖ్యానించటం గమనార్హం.