Begin typing your search above and press return to search.
చాయ్ వాలాకు డిప్యూటీ సీఎం పోస్టు
By: Tupaki Desk | 19 March 2017 6:42 AM GMTతనను తాను చాయ్ వాలాగా చెప్పుకొనే ప్రధాని మోడీ ఉత్తర్ ప్రదేశ్ కు కూడా ఓ చాయ్ వాలాను నాయకుడిని చేశారు. యూపీ ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన కేశవ ప్రసాద్ మౌర్య కూడా చిన్నతనంలో టీ విక్రయించినవారే కావడం విశేషం. ఆయన పేరు తొలుత సీఎం రేసులో ముందున్నప్పటికీ ఆ ఛాన్సు దక్కలేదు. ఈశాన్య యూపీలో మంచి పట్టున్న యోగి ఆదిత్యనాథ్ కు సీఎం పదవి ఇవ్వాలని ఆయన వర్గం నుంచి ఆరెస్సెస్ నుంచి ఒత్తిడి రావడం.. యూపీ అవసరాల రీత్యా కూడా మౌర్య కంటే యోగి బెటరని భావించడంతో మౌర్య చాన్సు మిస్సయ్యారు.
అలహాబాద్ సమీపంలోని కౌశాంబి జిల్లాలో జన్మించిన కేశవ్‌ప్రసాద్ మౌర్య అలహాబాద్‌లోని హిందూ సాహిత్య సమ్మెళన్ లో హిందీ లిటరేచర్ చదివారు. తన చిన్నవయస్సులో చాలా కాలం చాయ్ అమ్ముతూ పేపర్లు వేస్తూ ఉండేవారు. ఓబీసీ సామాజికవర్గం నుంచి వచ్చిన ఆయన సంఘ్ పరివార్ లో చాలా కాలం పనిచేశారు. సంఘ్ లోకి రాకముందు వరకు కూడా ఆయన చాయ్ విక్రయించేవారట.
యూపీ వాడైనప్పటికీ కర్ణాటకలో బీజేపీ - ఆరెస్సెస్ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు చాలాకాలం పనిచేశారు. మౌర్యాకు కాశీ ప్రాంతంలో కిసాన్ మోర్చా - వెనకబడిన తరగతుల సెల్ నేతగా కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. 2002 - 2007 - 2012 సంవత్సరాల్లో యూపీ అసెంబ్లికి సిరాతు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరుపున పౌల్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/