Begin typing your search above and press return to search.
జూనియర్ ఎన్టీయార్ కి అధికార ప్రతినిధిగా కొడాలి...?
By: Tupaki Desk | 25 Aug 2022 2:40 PM GMTజూనియర్ ఎన్టీయార్ ప్రముఖ సినీ నటుడు. ఆయన తాత సీనియర్ ఎన్టీయార్ మాజీ ముఖ్యమంత్రి కూడా. ఆ తాత వారసుడిగా జూనియర్ కి రాజకీయ వాసనలు కూడా ఉన్నాయి. ఆయన టీడీపీ తరఫున ప్రచారం కూడా 2009 ఎన్నికల్లో చేశారు. అయితే జూనియర్ ఈ మధ్యన కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కావడంతో ఆయన రాజకీయ ప్రస్థానం మీద జోరుగా చర్చ సాగుతోంది.
నిజానికి వన్ టూ వన్ గా సాగిన అమిత్ షా జూనియర్ ల భేటీలో ఏమి మాట్లాడుకున్నారో కరెక్ట్ గా ఆ ఇద్దరే చెప్పాలి. అమిత్ షా అయితే ఎక్కడా పెదవి విప్పలేదు, జూనియర్ కూడా సైలెంట్ గా ఉన్నారు. మధ్యలోనే చాలా హడావుడి సాగుతోంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీయార్ కి ఒకనాడు బాగా క్లోజ్ అయిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని అయితే గడచిన మూడు రోజులుగా జూనియర్ రాజకీయాల గురించి వరసబెట్టి మరీ మాట్లాడుతూ మీడియాకు కావాల్సిన మసాలా ఇస్తున్నారు.
జూనియర్ తో అమిత్ షా మీటింగ్ పూర్తి రాజకీయం కోసమే సాగిందని, పాన్ ఇండియా స్టార్ గా ఉన్న జూనియర్ సేవలను బీజేపీ జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తరువాత రెండవ రోజు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీయార్ దే టీడీపీ అన్నట్లుగా మాట్లాడారు. చంద్రబాబు ఆ పార్టీని లాక్కున్నారు అని కూడా సెటైర్లు వేశారు.
ఇక ఇపుడు ఆయన మళ్ళీ గొంతు సవరించి ఎవరో ఏదో అడిగారని, అన్నారని జూనియర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని, సరైన టైమ్ లో జూనియర్ టీడీపీని టేకోవర్ చేస్తారని చెప్పుకొచ్చారు. అపుడు టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని కూడా చెప్పారు. ఆ విధంగా చూస్తే చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకోవాల్సిందే అని కూడా కొడాలి నాని జోస్యం చెప్పారు.
మొత్తానికి గత మూడు రోజులుగా కొడాలి నాని చేస్తున్న కామెంట్స్ అన్నీ చూస్తే జూనియర్ ఎన్టీయార్ కి ఆయన అధికార ప్రతినిధిగా మారిపోయారా అన్న చర్చ సాగుతోంది. జూనియర్ కి కొడాలికి ఆ మధ్యనే గ్యాప్ వచ్చింది అని అంతా అనుకున్నారు. అయితే ఇపుడు జూనియర్ అమిత్ షా తో భేటీ తరువాత కొడాలి పాత నానిగా మారి జూనియర్ విషయంలో కొంత సానుకూలతతో మాట్లాడుతున్నారని అంటున్నారు.
మొత్తానికి జూనియర్ రాజకీయాల్లోకి వస్తారని, టీడీపీ పగ్గాలు తీసుకుంటాడని, అయితే దానికి బాగా టైమ్ ఉందని అన్నీ కొడాలి నాని తన నోటితోనే చెబుతున్నారు. బహుశా పాత స్నేహంతోనే నాని ఈ మాటలు చెబుతున్నారా. లేకపోతే కాస్తా చనువు తీసుకుని జూనియర్ కి అధికార ప్రతినిధిగా మారిపోయారా అన్నదే ఇక్కడ చర్చ.