Begin typing your search above and press return to search.
పులిని పట్టుకుంటారా..? దాన్ని పెళ్లి చేసుకోమంటారా..? ప్రభుత్వానికి ఎమ్మెల్యే అల్టిమేటం!
By: Tupaki Desk | 10 March 2021 8:30 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం వరకు మనుషుల్ని చంపుతున్న పులిగురించి తీవ్రస్థాయిలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కర్నాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆ రాష్ట్రంలోని కొడుగు జిల్లాలో గడిచిన నాలుగు రోజుల్లోనే ఓ పులి నలుగురిని చంపేసింది. దీంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఆ పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించినా.. సాధ్యం కావట్లేదు.
ఈ నేపథ్యంలోనే అక్కడ అసెంబ్లీ సమావేశాలు మొదలవడంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మనుషుల్ని వేటాడుతున్న పులిగురించి సభ దృష్టికి తెచ్చారు కొడగు ఎమ్మెల్యే బోపయ్య. పులి మనుషుల్ని చంపుతున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇకనైనా పులిని పట్టుకుంటుందా? లేదా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. సర్కారు వల్ల కాకపోతే తామే దానిని పెళ్లి చేసుకుంటామని చెప్పారు.
పెళ్లి చేసుకోవడం అంటే.. దానిని చంపేయడం అని అర్థం. కన్నడలోని ఈ నారీ మంగళ సంప్రదాయం అనాదిగా ఉంది. పూర్వ కాలంలో ఊళ్లమీద పడి పశువులను, మనుషులను చంపే పులులను వేటగాళ్లు మట్టుబెట్టేవాళ్లు. అలా చంపేసిన తర్వాత దానిని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇలా చేయడం ద్వారా పాపం ఉండదని వారు భావిస్తారు. ఇలా పులిని చంపి, పెళ్లి చేసుకున్న వారికి గ్రామస్థులు బహుమతులు అందిస్తారు.
అయితే.. ఎమ్మెల్యే చేసిన ఈ ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించలేదు. ఆ పులిని త్వరలోనే పట్టుకుంటామని, ఇందుకోసం ప్రత్యేక పద్ధతులు అనుసరిస్తామని చెప్పారు. అది కూడా సాధ్యం కాకపోతే అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు.