Begin typing your search above and press return to search.

లోకేష్ జూమ్ మీటింగ్‌పై కొడాలి హాట్ కామెంట్లు !

By:  Tupaki Desk   |   9 Jun 2022 11:18 AM GMT
లోకేష్ జూమ్ మీటింగ్‌పై కొడాలి హాట్ కామెంట్లు !
X
టీడీపీ యువ నాయ‌కుడు.. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప‌దో త‌ర‌గ‌తి త‌ప్పిన విద్యార్థుల తో నిర్వ‌హించిన జూమ్ మీటింగ్‌లో ప‌లువురు వైసీపీ నాయ‌కులు కూడా పాల్గొన్నారు. వీరిలో ఇటీవ‌ల జంప్ చేసిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నాని అనూహ్యంగా ప్ర‌వేశించిన విష‌యం సంచ‌ల‌నం గా మారింది. దీనిపై టీడీపీ నేతలు ఆస‌క్తిగా స్పందించారు. అయితే.. ఇదే విష‌యంపై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ హాట్‌గా రెస్పాండ్ అయ్యారు.

అభం శుభం తెలియని పిల్లలకు ఏవేవో చెప్పి వారు ఆత్మహత్యలకు పాల్ప‌డేలా.. నారా లోకేష్ ప్రేరేపి స్తున్నారని మండి పడ్డారు. లోకేష్‌వి పిల్ల రాజ‌కీయాల‌ని వ్యాఖ్యానించారు.

తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి పనులు చేయవద్దని చెప్పడానికే లోకేష్ జూమ్ మీటింగ్ లో తాను చేరినట్లు చెప్పారు. ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ సహా పలువురు వైసీపీ నేతలు జూమ్ లోకి వెళ్లి లోకేష్ ను ప్రశ్నించారని పేర్కొన్నారు.

లోకేష్ తో బహిరంగంగా చర్చించేందుకు తనకు భయం లేదని కొడాలి వ్యాఖ్యానించారు. తాను తన ఐడీతో డైరెక్ట్ గా వెళితే లోకేష్ మాట్లాడరు కాబట్టే పిల్లల లింక్ నుంచి జూమ్ మీటింగ్ లోకి వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఉద్యోగులు, తల్లిదండ్రులు, పిల్లలతో పాటు కొన్ని రాజకీయ పార్టీలతోనూ లోకేష్ మాట్లాడించి ఉండాల్సిందన్నారు. లోకేష్ ఎలా మాట్లాడినా తాము మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు. కరోనా వల్ల రెండేళ్లుగా 8,9 తరగతులు సరిగా జరగలేదన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో లాప్ ట్యాప్ లు, ఆన్ లైన్ క్లాసులు లేకపోవడం వల్ల పిల్లల స్టాండర్డ్స్ పడిపోయా యని పేర్కొన్నారు. కరోనా వల్ల క్లాసులు జరగక పోవడం వల్లే పదో తరగతి పిల్లల ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు.

ఫెయిల్ అయిన విద్యార్థుకు తిరిగి పరీక్ష రాస్తే డైరెక్ట్ పాసైనట్లు సర్టిఫికెట్ ఇస్తాం అని అన్నారు. ప్రభుత్వం వల్ల పిల్లలు ఎవరూ నష్టపోలేదని, పదోతరగతి ఫెయిలైన పిల్లల విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నాని వ్యాఖ్యానించారు.