Begin typing your search above and press return to search.
బాబు నీచ బుద్ది తెలియాలంటే పవన్ - ఎన్టీఆర్ లను అడుగు .. రామ్ కి ఏపీ మంత్రి సలహా !
By: Tupaki Desk | 25 Aug 2020 2:00 PM GMTవిజయవాడలోని కరోనా కేర్ సెంటర్ అయిన స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. ఈ వ్యవహారం పై హీరో రామ్ ట్విట్టర్ లో స్పందించిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టించాయి. ఆ ట్వీట్లు పెద్ద దుమారమే లేపాయి. ఆ ట్వీట్ల గురించి చాలామంది చాలా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. తాజాగా హీరో రామ్ ట్వీట్లపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. అదే సందర్భంలో హీరో రామ్ కి ఓ సలహా కూడా ఇచ్చారు.
కొడాలి నాని మాట్లాడుతూ .. రామ్, నువ్వు కానీ , చంద్రబాబు మాటలు వింటే అంతే సంగతులు. చంద్రబాబు ఎవరి కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరారో అందరికీ తెలుసు. తిన్నింటి వాసాలే లెక్కపెట్టి.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు. పార్టీని లాక్కున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసినవే.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు మాట వింటే, ఆ తరువాత వారి బతుకు ఎలా ఉంటుందో సహా నటులైన పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ను అడుగు. వాళ్లే నీకు సవివరంగా చెప్తారు. ఆయన మాటలు వింటే నీ సినిమా కెరీర్ గోవిందా.. అంటూ రామ్ కు సలహాలు ఇచ్చారు.
రమేశ్ ఆసుపత్రి ఎండీ రమేశ్ బాబు ఏం తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతున్నారు. ఆ ఆసుపత్రి యజమాని వెనుక బడా బాబులు ఉన్నారు. రమేశ్ ఎక్కడ దాక్కున్నాడో ఏపీ మొత్తం తెలుసు. చంద్రబాబు ఇంట్లో రమేశ్ దాక్కున్నాడు, అంటూ మంత్రి ఆరోపించారు.
చంద్రబాబుకు అల్జీమర్స్ వ్యాధి ఉంది. అందుకే ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదు. తనకు విరాళాలు ఇచ్చే వాళ్లకు మాత్రమే చంద్రబాబు అనుకూలంగా మాట్లాడుతారు. అచ్చెన్నాయుడు , కొల్లు రవీంద్ర అరెస్ట్ అయినా సమయంలో వైసీపీ బీసీలను టార్గెట్ చేసింది అని , ఇప్పుడు స్వర్ణ ప్యాలెస్ ఘటన లో రమేష్ హాస్పిటల్ పై చర్యలు తీసుకుంటుంటే ప్రభుత్వం కమ్మ వర్గాన్ని టార్గెట్ చేసిందని విమర్శలు చేస్తున్నారని , ఏ సామాజిక వర్గాన్ని కూడా టార్గెట్ చేయాల్సిన అవరసం సీఎం వైఎస్ జగన్ కు లేదని మంత్రి స్పష్టం చేశారు.