Begin typing your search above and press return to search.

చంద్రబాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటా: నాని

By:  Tupaki Desk   |   10 Sep 2020 4:30 PM GMT
చంద్రబాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటా: నాని
X
ఏపీలో ఫైర్ బ్రాండ్ మంత్రి అయిన కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చెడా మడా తిట్టేశారు. గురువారం గుడివాడలో పర్యటించిన మంత్రి నాని మీడియాతో మాట్లాడారు.

కొన్ని చోట్ల న్యాయస్థానం స్టే ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని.. ఇళ్లస్థలాల పంపిణీ వాయిదా వేశామన్నారు. రాష్ట్రంలో పేదలకు అందించే ఇళ్ల స్థలాలు మహిళల పేరుమీదే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి నాని అన్నారు.

ఎవరు ఎన్నికేసులు వేసినా వాటన్నింటిని పరిష్కరించుకొని మహిళల పేరునే రిజిస్ట్రేషన్ చేసి అందిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ పనిలేని వారే తనపై అనవసరపు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. తనపై ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా చంద్రబాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటానని మంత్రి నాని స్పష్టం చేశారు.