Begin typing your search above and press return to search.

నీ ఇంటికొస్తా చర్చకి సిద్ధమా ... దేవినేని ఉమా కి కొడాలి నాని , వల్లభనేని వంశీ సవాల్ !

By:  Tupaki Desk   |   19 Jan 2021 10:39 AM GMT
నీ ఇంటికొస్తా చర్చకి సిద్ధమా ... దేవినేని ఉమా కి కొడాలి నాని , వల్లభనేని వంశీ సవాల్ !
X
ఏపీ రాజకీయం సవాళ్లు , ప్రతి సవాళ్లతో హాట్ హాట్ గా సాగుతుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా రాజకీయం ఇప్పుడు మంచి కాకమీద ఉంది. మాజీ మంత్రి దేవినేని ఉమా ,ప్రస్తుత మంత్రి కొడాలి నాని మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. మంత్రి కొడాలి నానితో పాటుగా , ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా దేవినేని ఉమా పై తమదైన రీతిలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. సోమవారం నాని చేసిన వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమంటూ విజయవాడలోని గొల్లపూడి సెంటర్‌కు వచ్చిన దేవినేనిని అదుపులోకి తీసుకుని స్టేషన్ ‌కు తరలించారు పోలీసులు.

ఈ నేపథ్యంలో మరోసారి ఉమకు మంత్రి కొడాలి నాని బహిరంగ సవాల్‌ విసిరారు. తాను చర్చకు రమ్మంటే, దీక్ష, ఆందోళన అంటూ దేవినేని ఉమ నాటకాలు ఆడుతున్నారని విమర్శలు కురిపించారు. తాను ఫోన్‌ చేసినా దేవినేని ఉమ స్పందించలేదని, కానీ, కావాలనే డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఎలాగూ ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ చర్చకు పోలీసులు అంగీకరించరని తెలిసే, ఇలా రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని చవటల్లో దేవినేని ఉమ నంబర్‌ వన్‌ అంటూ ఎద్దేవా చేశారు. దేవినేనికి దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని మరోసారి సవాల్‌ చేశారు. మీడియా సమక్షంలోనే ఇరువురి మేనిఫెస్టో గురించి చర్చిద్దాం అని అన్నారు. రాత్రి నుండి 10 సార్లు ఫోన్ చేశా.. బహిరంగ చర్చకు సిద్ధమని, కానీ, ఫోన్ తీసి మాట్లాడే దమ్ముకూడా ఉమకు లేదని అన్నారు.

ఈ సందర్భంగా .. దేవినేని ఉమ అక్కే అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడు అంటూ సెటైర్లు వేశారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఉమక్కకు చీర సారె పెడతామని ఎవరైనా పిలిచారా అంటూ ప్రశ్నించారు. తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారు అని దేవినేని ఉమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్లు చేస్తున్నా దేవినేని ఉమ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, ఉమతో తేల్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. పాత సహచరులం కదా మాకూ ఆయనకూ చాలా లావాదేవీలున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రోడ్డు మీద చర్చలంటే ప్రభుత్వం అంగీకరిస్తుందా, అని ప్రశ్నించిన వంశీ , ఉమ ఇంటికెళ్లి చర్చించడానికి సిద్ధమని ప్రకటించారు. గతంలో ఉమ ఇంటికెళ్లినా ఇంట్లో లేకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. పాపం పండింది.. వ్యవస్థలను అడ్జం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు.. చంద్రబాబు పిల్లర్లు కదులుతున్నాయని కామెంట్స్ చేశారు.