Begin typing your search above and press return to search.
కొడాలి నాని.. ఆ తిట్లు మారిస్తే బెటరేమో!
By: Tupaki Desk | 14 Jan 2020 3:30 AM GMTఅవతల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అబద్ధాలతో జనాల చెవుల్లో పూలు పెడుతూ ఉంటారు. రాజధాని అంశంలోనే చంద్రబాబు నాయుడి మాటలు వింటే ఆశ్చర్యం కలగక మానదు. ఆఖరికి శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును కూడా చంద్రబాబు నాయుడు వక్రీకరిస్తూ ఉన్నారు. అమరావతిలో రాజధాని పెట్టడానికి మించిన తప్పు లేదని ఆ కమిటీ చెబితే, చంద్రబాబు మాత్రం అమరావతిలో రాజధానిని పెట్టమని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని పచ్చి అబద్ధాలను చెబుతూ ఉన్నారు.
ఇలా తనకు తోచినట్టుగా చంద్రబాబు నాయుడు ఎవరికి ఏ ఉద్దేశాలను ఆపాదించడానికి కూడా వెనుకాడటం లేదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయం కూడా చంద్రబాబుకు లేకుండా పోయింది. ఇలా ఎప్పటికప్పుడు కొత్త అబద్ధాలను చెప్పడంలో, కొత్త తరహాలో జనాలను డైవర్ట్ చేయడంలో చంద్రబాబు నాయుడు ఆరి తేరిపోతూ ఉన్నారు. అలాంటి అవకాశవాదంతో చంద్రబాబు నాయుడు వార్తల్లో ఉంటున్నారు.
అలాంటి చంద్రబాబును ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది కూడా. అయితే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆ అవకాశాలను ఉపయోగించుకుంటున్నట్టుగా లేదు. ఉదాహరణకు మంత్రి కొడాలి నాని తరచూ ప్రెస్ తో మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడుతూ ఉంటారు. అయితే
ఆ విరుచుకుపడటంలో ఎంతసేపూ.. దొంద, వెన్నుపోటుదారుడు.. అంటూ మండిపడటమే ఎక్కువంగా ఉంటుంది.
ప్రతి సారీ దాదాపు అదే రికార్డునే వేస్తూ ఉంటారు కొడాలి నాని. చంద్రబాబును విమర్శించాలంటే లేటెస్ట్ ఫ్యాక్ట్స్ తో, వాస్తవాలను ప్రస్తావిస్తూ విరుచుకుపడే అవకాశం ఎంతో ఉంది. అయితే ఈ మంత్రిమాత్రం పాత తిట్లనే రిపీట్ చేస్తూ ఉంటారు. అయితే పరుషమైన పదాలతో తిట్టడం వల్ల జనాలు సీరియస్ గా తీసుకునే అవకాశాలు లేవు. ఫ్యాక్ట్స్ ను ప్రస్తావిస్తూ, ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా మాట్లాడితే.. వచ్చే గుర్తింపే వేరు. ఈ విషయాన్ని ఈ మంత్రి గ్రహించాలని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.