Begin typing your search above and press return to search.
చంద్రబాబు నవ్వులు ఆ రోజుతో ఖతంః మంత్రి కొడాలి నాని
By: Tupaki Desk | 20 March 2021 10:14 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. చంద్రబాబుపై సీఐడీ విచారణ జరపకుండా కోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కొడాలి.. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కాదు.. 'స్టే'ల బాబు అని వ్యాఖ్యానించారు. కోర్టులో విచారణ ఎదుర్కోకుండా స్టే తెచ్చుకున్న బాబు.. దేశంలోనే అత్యంత పిరికి వ్యక్తి అని అన్నారు.
సీఐడీ విచారణ నేపథ్యంలో చంద్రబాబు కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆయనపై విచారణ జరగకుండా.. న్యాయస్థానం 4 వారాలు స్టే ఇచ్చింది. దీనిపై నాని స్పందిస్తూ.. ఇది తాత్కాలికమేనని, నాలుగు వారాల స్టే ముగిసిన తర్వాత శిక్ష తప్పదని అన్నారు.
ఆ తర్వాత ప్రజాకోర్టులోనూ చంద్రబాబు శిక్ష పడుతుందన్నారు. తిరుపతి ఉప ఎన్నిక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ద్వారా.. ఇక, బాబు శాశ్వతంగా ఇంటికే పరిమితం అవుతారని ఎద్దేవా చేశారు. కోట్లాది రపాయలు ఖర్చు పెట్టి సుప్రీం కోర్టు లాయర్లను తన తరపున వాదించుకోవడానికి పెట్టుకుంటారన్న నాని.. ఈ చర్యల ద్వారా శిక్షను తాత్కాలికంగానే అడ్డుకోగలరని అన్నారు. ప్రజాకోర్టులో శాశ్వత శిక్ష పడుతుందని అన్నారు.