Begin typing your search above and press return to search.
కమ్మ కుల ఉగ్రవాదులు... చెలరేగిన కొడాలి
By: Tupaki Desk | 11 Oct 2022 2:48 AM GMTఆయన కమ్మ కులస్థుడు. కానీ తన సొంత కులం మీద డేరింగ్ అండ్ డేషింగ్ గా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. కమ్మ కులంలో కొందరు ఉగ్రవాదులు చేరి అమరావతి రైతులను ముందు పెట్టి పాదయాత్ర పేరిట ఏపీలో అలజడి సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. కమ్మ కులం వారికే రాజధాని ఉండాలి. వారే ఏపీలో అధికారంలో ఉండాలి. కమ్మ కులంలో పుట్టిన ప్రతీ వారూ టీడీపీకి చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలి ఇలాంటి ఉగ్ర ఆలోచనలతో కొందరు టీడీపీలో ఉన్నారని నాని సంచలన కామెంట్స్ చేశారు.
ఉంటే టీడీపీలో ఉండాలి లేకపోతే వేరే పార్టీలో ఉంటే కమ్మ వారినైనా ఓడిస్తామన్న దుర్నీతితో వారంతా ఏపీలో రాజధాని పేరిట యాత్రలు చేస్తున్నారని నాని మండిపడ్డారు. గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్ర పేరిట వచ్చి నానీ నిన్ను ఓడిస్తామంటూ అనుచిత కామెంట్స్ చేశారని ఆయన ఆరోపించారు. తనను ఓడిస్తామని తొడలు కొట్టి మీసాలు తిప్పిన వారంతా 2019 ఎన్నికలలో ఓడిన వరేనని ఆయన ఎద్దేవా చేశారు.
ఇక అమరావతి రైతుల పాదయాత్ర అని చెబుతున్నారని అందులో ఉన్నదెవరని ఆయన ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్, గద్దె అనూరాధ, బోడె ప్రసాద్, రావి వెంకటేశ్వర్లు ఇలా ఉన్న వారంతా కమ్మ వారే కదా అని ఆయన లిస్ట్ చదివారు. ఆఖరుకు పాదయాత్రలో తొడకొట్టిన ఆవిడ కూడా అదే కులం కాదా అని ఎత్తి చూపారు. అమరావతి యాత్ర పేరిట చేస్తున్నది ఏపీలో తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని జగన్ని దించేయాలన్న రాజకీయ అజెండా తప్ప మరేమీ లేదని కొడాలి నాని తేల్చేశారు.
దీనికి టీడీపీ అనుకూల మీడియా కూడా దన్నుగా ఉండి భారీ కవరేజి ఇస్తోందని ఆయన విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణం అంటున్నారు. అసలు ఈ కాన్సెప్టే తప్పు అని ఆయన అన్నారు. రాజధానులు ఎవరూ నిర్మించరని , మంచి నగరాలను చూసుకుని అక్కడ రాజధానులుగా ఎంచుకుంటారని, అలాగే విశాఖను తమ ప్రభుత్వం ఎంచుకుందని నాని చెప్పుకొచ్చారు. ఆ విధంగా తక్కువ ఖర్చుతో విశాఖ రాజధానిగా ఉంటే ఆ వచ్చే ఆదాయంతో ఏపీ బాగుపడుతుంది అన్నదే జగన్ ఆలోచన అని చెప్పారు.
అలాగే కర్నూల్ లో హై కోర్టు వస్తే యాక్టివిటీ పెరిగి అక్కడ కూడా అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. అమరావతి రాజధానిని ఎవరూ తీసివేయడం లేదని, అక్కడ శాసన రాజధాని ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు చెప్పినట్లుగా అమరావతి రాజధాని నిర్మాణం కావాలంటే రెండు వందలు ఏళ్ళు టైం పడుతుందని నాని సెటైర్లు వేశారు.
రాజధాని నిర్మిస్తామని అంటున్నారు. ఏమిటి నిర్మిస్తారు నా బొచ్చు అంటూ నాని మండిపడ్డారు. మొత్తానికి చూస్తే నాన్ టీడీపీ కమ్మలను టీడీపీ టార్గెట్ చేస్తోందని కొత్త విషయాన్ని కొడాలి చెప్పుకొచ్చారు. అలాగే అంతా మాకే ఉండాలన్న ఉగ్రవాద మనస్తత్వంతో కొందరు కమ్మలు అమరావతి ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్నారని అయితే అన్ని విషయాలు తెలిసిన ప్రజలు వీటిని నమ్మే అమాయకులు మాత్రం కారని నాని ఒక్క ముక్కలో తేల్చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.