Begin typing your search above and press return to search.
మాచర్ల రణరంగం కామనే.. మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్
By: Tupaki Desk | 17 Dec 2022 4:42 PM GMTపల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ నేతలు, కార్యకర్తలు సృష్టించిన రగడతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలకు చెందిన వాహనాలను వైసీపీ కార్యకర్తలు తగల పెట్టడం.. టీడీపీ నేతలపై రాళ్లు, కర్రలతో దాడులు చేయడం.. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడమే కాకుండా.. పల్నాడు రణరంగాన్ని తలపించింది.
అయితే.. ఈ హింసపై వైసీపీ ఫైర్ బ్రాండ్‌నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. ఇదంతా కామనేనని ఆయన ఒక్క మాటతో తేల్చేశారు. అంతేకాదు..టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వల్లే ఇదంతా చోటు చేసుకుందని.. దీనికి ఆయనే కారణమని వ్యాఖ్యానించారు.
టీడీపీ కార్యకర్తలు.. వైసీపీ నేతలపై విరుచుకుపడాలని, వైసీపీ నేతల బట్టలూడదీసి కొట్టమని, వారి ఇళ్లలోకి దూరి కొట్టమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని పార్టీ కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకున్నారని.. అలాంటి వారివల్లే మాచర్ల హింస చోటు చేసుకుందని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయబట్టే ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారని, అందుకే ఈ హింస చోటు చేసుకుందని కొడాలి అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు సర్వసాధారణమేనని తేల్చేశారు.
రాజకీయాల్లో గొడవలు ఇదే మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదని కొడాలి నాని తెలిపారు. 75 ఏళ్ల వయసు వచ్చినా.. చంద్రబాబుకు ఎలాంటి జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. బట్టలూడదీసి కొడతానని రోజూ అంటున్నారని, ఇలాంటి వ్యాఖ్యల వల్లే మాచర్ల హింస చోటు చేసుకుని ఉండొచ్చని నాని చెప్పారు. బహిరంగ సభల్లో చంద్రబాబు మాటలను, మాచర్లలో టీడీపీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకొని ఉంటారన్నారు. గతంలో వైసీపీ మంత్రి రోజా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న ప్రశ్నకు రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమని కొడాలి నాని అనడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.