Begin typing your search above and press return to search.
జగన్ ఇంటి బాత్రూంను లోకేశ్ కడిగాడా? కొడాలి నిప్పులు
By: Tupaki Desk | 27 Dec 2020 4:00 AM GMTప్రతిపక్షం అన్న తర్వాత విమర్శలు మామూలే. కాకుంటే.. వెనుకా ముందు చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తే.. ఎలాంటి పంచ్ లు పడతాయన్న విషయం తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత.. మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలు చూస్తే ఇట్టే అర్థమైపోతాయి. పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో తీవ్రంగా మండిపడ్డారు.
పేదలకు జగన్ ప్రభుత్వం నిర్మించే ఇళ్లను ముఖ్యమంత్రి జగన్ ఇంటి బాత్రూంతో పోల్చిన లోకేశ్ పై కొడాలి తీవ్రంగా స్పందించారు. నిప్పులు కురిపించినంత పని చేశారు. పేదలకు ఇస్తున్న ఇళ్లను బాత్రూంతో పోల్చటమా? పేదలంటే లోకేశ్ కు అంత చులకనా? అంటూ సీరియస్ అయ్యారు. అంతేకాదు.. జగన్ ఇంటి బాత్రూం గురించి మాట్లాడుతున్న లోకేశ్.. ఎప్పుడైనా జగన్ ఇంటి బాత్రూం కడిగారా?అంటూ సీరియస్ అయ్యారు.
గుడివాడలోని గుడ్లవల్లేరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కొడాలి నాని.. జగన్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. పేదలపై ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించిన మంత్రి.. ‘‘బాబు ప్రవేశ పెట్టిన ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ లో ఒక్కో ఇంటి వైశాల్యం 244 చదరపు అడుగులు. అదే సీఎం జగన్ ఇస్తున్న ఇంటి వైశాల్యం 340 చదరపు అడుగులు. అలాంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా?’’ అని పేర్కొన్నారు.
పేదలకు ఇస్తున్న ఇళ్లను.. జగన్ ఇంటి బాత్రూంలతో పోల్చటం ఏమిటి? అని ప్రశ్నించారు. ‘ఎవరి బాత్రూంలు ఎంత ఉన్నాయో కొలిచే దుస్థితిలో బాబు.. లోకేశ్ ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పన్నెండేళ్ల క్రితం గుడ్లవల్లేరులో 31 ఎకరాలను ఇళ్ల స్థలాలకు ఇస్తే.. ఇప్పుడు అక్కడ జగన్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నారు. వైఎస్ తర్వాత ముఖ్యమంత్రులు ఎవరు ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు’’ అని గుర్తు చేశారు. అన్ని సందర్భాల్లోనూ విమర్శలు అతకవన్న విషయాన్ని లోకేశ్ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.