Begin typing your search above and press return to search.
కామినేనికి తమ మాటతో షాకిచ్చిన జగన్ బ్యాచ్
By: Tupaki Desk | 7 July 2016 4:49 AM GMTఏపీ విపక్ష అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా షురూ చేసిన గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం తొలిరోజు ఆసక్తికర వ్యాఖ్యలకు వేదికగా మారింది. ఏపీ అధికారపక్షంపై ఎక్కడికి అక్కడ దుమ్ము దులిపే ప్రోగ్రాంను వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మొదలెట్టారనే చెప్పాలి. ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ పై జగన్ బ్యాచ్ ఎమ్మెల్యే కొడాలి నాని.. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు కొలుసు పార్థసారధి ఫైర్ అయిన తీరు అందరిని ఆకర్షిస్తోంది. దూకుడుగా మాట్లాడుతూ.. ఏపీ అధికారపక్షాన్ని తిట్టిపోసే అలవాటున్న కొడాలి నాని తాజాగా మంత్రి కామినేనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మంత్రి కామినేని పని తీరును తీవ్రస్థాయిలో తప్పు పట్టిన నాని.. తమపార్టీ అధినేత వైఎస్ జగన్ పై మంత్రి కామినేని అనవసర వ్యాఖ్యలు చేస్తే.. తన కంటే వయసులో పెద్దవాడైన విషయాన్న వదిలేసి మరీ రోడ్డు మీదకు వచ్చి తిడతానని కొడాలి నాని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. కొలుసు మాటలు మరింత పవర్ ఫుల్ గా ఉన్నయి. దేశంలో అనారోగ్యంతో మరణించిన శిశువుల్ని చూశామని.. కానీ.. ఏపీలో మాత్రం చీమలు.. ఎలుకలు కరిచి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని.. ఇలాంటి పరిస్థితి దేశంలో మరెక్కడైనా ఉందా? అంటూ నిలదీశారు. ఇక.. పార్టీ కార్యదర్శి ఉదయభాను మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కామినేని గాలి వాటంగా విజయం సాధించారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదంటూ జోస్యం చెప్పారు. మొత్తంగా జగన్ బ్యాచ్ చేసిన వ్యాఖ్యలు కామినేనికి షాకింగ్ గా మారతాయనటంలో సందేహం లేదనే చెప్పాలి.