Begin typing your search above and press return to search.

చంద్రబాబు పార్టీ పెడితే.. డిపాజిట్లు గల్లంతే

By:  Tupaki Desk   |   2 May 2017 2:16 PM GMT
చంద్రబాబు పార్టీ పెడితే.. డిపాజిట్లు గల్లంతే
X
తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకోబట్టి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగలిగారు కానీ.. ఆయన సొంతంగా పార్టీ పెడితే మాత్రం డిపాజిట్లు కూడా రావని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు టీడీపీని నందమూరి కుటుంబానికి ఇచ్చేసి.. సొంతంగా పార్టీ పెడితే ఆయన పరిస్థితి దయనీయంగా ఉంటుందని నాని ఎద్దేవా చేశారు. జయంతికి.. వర్థంతికి తేడా కూడా తెలియని వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిని చేశారని.. ఆ మంత్రి నీటి సమస్యను పరిష్కరిస్తా అనే బదులు సృష్టిస్తా అంటున్నాడని నాని విమర్శించారు. ప్రస్తుతం తెలుగుదేశం నేతలతో పాటు కొందరు అధికారులు కూడా ఓవరాక్షన్ చేస్తున్నారని.. జగన్ సీఎం అయితే ఇక్కడి నుంచి చంద్రబాబు పారిపోతాడన్న సంగతి దృష్టిలో ఉంచుకుని అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని నాని అన్నారు.

రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని.. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక ప్రభుత్వం చేతిలో దారుణమైన మోసానికి గురవుతున్న నేపథ్యంలో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు దీక్ష చేపట్టారని నాని అన్నారు. దున్నపోతు ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే జగన్‌ దీక్షకు పూనుకున్నారన్నారు. గతంలో తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రైతుల కోసం రూ.5 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని నాని డిమాండ్‌ చేశారు. జగన్ దీక్షకు స్పందించి రైతుల్ని ఆదుకుంటారనుకుంటే.. మంత్రులు.. పకోడీగాళ్లను పెట్టించి జగన్ ను తిట్టించే పనిలో చంద్రబాబు ఉన్నారన్నారు. ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని నాని డిమాండ్‌ చేశారు. తమ నాయకుడి మీద అవాకులు చవాకులు పేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు ఆక్రమించుకుంటే.. కాంగ్రెస్‌ విధానాలు నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా పార్టీ పెట్టి నాయకుడు జగన్ అని నాని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/