Begin typing your search above and press return to search.
బాబు మీద కొడాలి నాని ఫైరింగ్
By: Tupaki Desk | 24 Feb 2016 6:36 AM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరటంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. జగన్ బ్యాచ్ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ.. అలాంటి పరిస్థితి ఏమీ లేదన్న విషయాన్ని స్పష్టం చేసే క్రమంలో జిల్లాల వారీగా ప్రెస్ మీట్లు పెట్టించి మరీ చంద్రబాబు మీద తిట్టిస్తున్న జగన్.. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన నేతల్ని మీడియా ముందుకు దీసుకొచ్చారు.
చంద్రబాబు పేరు వింటే చాలు ఒంటికాలి మీద లేచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి ఏపీ ముఖ్యమంత్రిని తిట్టే బాధ్యత అప్పగించారు. ఈ సందర్భంగా చెలరేగిపోయిన నాని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తమ పార్టీ నుంచి జంప్ అయి సైకిల్ ఎక్కిన నలుగురు ఎమ్మెల్యేల చేత చంద్రబాబు రాజీనామా చేయించి.. తిరిగి వాళ్లను ఎన్నికల్లో నిలిపి గెలుచుకునే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. ఒకవేళ రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో కానీ గెలిపించుకుంటే తాము నోరుమూసుకొని ఉంటామని.. ఒకవేళ అలా చేయలేని పక్షంలో బాబు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
తాను పార్టీ మారినప్పుడు రూ.30కోట్లకు అమ్మడుబోయినట్లుగా ప్రచారం చేశారని.. ప్రస్తుతం టీడీపీలోకి చేర్చుకున్న నలుగురు ఎమ్మెల్యేలకు ఎంతిచ్చారని ప్రశ్నించారు. విజయవాడకు చెందిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను పార్టీ మారేందుకు మంత్రి దేవినేని ఉమ బ్రోకర్ గా వ్యవహరించినట్లు ప్రజలు అనుకున్నట్లుగా వ్యాఖ్యానించారు.ప్రజల పేరు చెప్పి.. అలా అనుకుంటున్నారు.. ఇలా అనుకుంటున్నారంటూ.. అనాల్సిన మాటలన్ని అనేసిన కొడాలి నాని సవాలు మీద తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారన్నదే ప్రశ్న.