Begin typing your search above and press return to search.
చంద్రబాబు మహిళలను అడ్డుపెట్టుకొని గెలవాలని చూశారుః కొడాలి నాని
By: Tupaki Desk | 15 March 2021 5:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ ఏకపక్షంగా గెలుపు జెండా ఎగరేసింది. ఎలక్షన్ జరిగిన 12 కార్పొరేషన్లలో ఏకంగా 11 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. మరో స్థానం ఫలితం కోర్టు తీర్పు కారణంగా వాయిదాపడింది. ఇక, ఎన్నిక జరిగిన 75 మునిసిపాలిటీలు, మేజర్ పంచాయతీల్లో ఏకంగా 74 చోట్ల విజయదుందుభి మోగించింది జగన్ పార్టీ. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు అమరావతి మహిళను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధిపొందాలని చూశారని విమర్శించారు. అమరావతిలో ఉన్న రైతులను చంద్రబాబు రోడ్డుపైకి తెచ్చారన్న మంత్రి.. ఇకనైనా అమరావతి ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ ఫలితాలను చూసిన తర్వాతైనా సిగ్గుంటే చంద్రబాబు కృష్ణా జిల్లాలో మళ్లీ అడుగు పెట్టొద్దని అన్నారు.
ప్రజలకు ఏం కావాలో ముఖ్యమంత్రి జగన్ కు తెలుసని అన్నారు మంత్రి నాని. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవారే ప్రజానాయకులన్న ఆయన.. టీడీపీని, చంద్రబాబును ప్రజలు మరోసారి తిరస్కరించారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారని, మేనిఫెస్టోలోని తొంభై శాతం హామీలను జగన్ నెరవేర్చారని చెప్పారు.
మరోవైపు చంద్రబాబు కార్యకర్తలకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు బాగా పనిచేశారని, ఈ ఫలితాలతో నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని, మంచిరోజులు వస్తాయని అన్నారు.