Begin typing your search above and press return to search.

బాబు చేతిలో పవన్ గంగిరెద్దు.. సొంత కొడుకును కాక దత్తపుత్రుడ్ని నమ్ముకున్నాడు

By:  Tupaki Desk   |   10 Oct 2021 9:50 AM GMT
బాబు చేతిలో పవన్ గంగిరెద్దు.. సొంత కొడుకును కాక దత్తపుత్రుడ్ని నమ్ముకున్నాడు
X
సుదీర్ఘకాలం టీడీపీలో సభ్యుడిగా ఉన్న కొడాలి నాని.. వైసీపీలో చేరిన తర్వాత నుంచి ఎంతలా ఆయనపై విరుచుకుపడుతున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన..తరచూ చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ మీదా.. జనసేన అధినేత పవన్ మీదా అదే పనిగా ఫైర్ కావటం తెలిసిందే. ఘాటు విమర్శలతో తరచూ చీల్చి చెండాడుతూ ఉండటం తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడిన కొడాలి.. బాబు.. పవన్ మీద సంచలన ఆరోపణలు చేశారు. బాబు.. పవన్ లు ఇద్దరికి ఏపీలో రాజకీయంగా అడ్రస్ లేదని.. ఫ్యూచర్ లోనూ నష్టం తప్పదని హెచ్చరించారు. 'జగన్ మిమ్మల్ని చీల్చి చెండాడుతాడు' అంటూ కొడాలి తీవ్రంగా స్పందించారు.

రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన చేసిన చంద్రబాబు.. స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారన్నారు. బద్వేలు ఉప ఎన్నిక నుంచి పారిపోయాడన్న ఆయన.. చంద్రబాబుకు తన మీద తనకు నమ్మకం ఉందా? కొడుకు లోకేశ్ మీదా నమ్మకం లేదన్నారు. పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు.. తానిచ్చిన ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేని దద్దమ్మగా అభివర్ణించారు. లోకేశ్ ను సన్నాసిగా అభివర్ణించిన కొడాలి నాని.. పార్టీని గట్టెక్కించలేడనే కారణంతో దత్తపుత్రుడు పవన్ వైపు చూస్తున్నాడన్నారు.

చంద్రబాబు చేతిలో పవన్ గంగిరెద్దు అని అభివర్ణించిన కొడాలి.. టీడీపీని జనసేనలో విలీనం చేయాలన్నారు. ఇద్దరు కలిసి ఎన్ని నాటకాలు ఆడినా.. కుట్రలు చేసినా.. యువ సింహం జగన్ ను ఏమీ చేయలేరన్నారు. పవన్ కల్యాణ్ కు మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. జగన్ పంజా దెబ్బలు వారిద్దరికి తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

ఏ రాజకీయ పార్టీ అయిన బలహీన వర్గాలకు అండగా ఉంటుందని.. పవన్ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి అండగా ఉంటానని వ్యాఖ్యానించటాన్ని తప్పు పట్టారు. ఆఫ్ఘన్ నుంచి డ్రగ్స్ విషయంలో తాడేపల్లికి లింకు ఉన్నాయని ఆరోపించారు. ఐటీ శాఖకు పన్నులు ఎగ్గొట్టి హెరిటేజ్ లో డబ్బులు పెట్టారని.. లేకుంటే రెండు ఎకరాల చంద్రబాబుకు రూ.2వేల కోట్లకు ఎలా ఎదిగారంటూ ప్రశ్నించారు. డ్రగ్స్ ను తీసుకునేది బాబు కుటుంబమేనని.. జగన్ మీద ఎన్ని నిందలు వేసినా.. నిరూపించటం సాధ్యం కాదన్నారు. మాఫియాతో సంబంధాలు ఉండేవి చంద్రబాబుకేనని.. ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఉత్తరాంధ్ర నుంచి గంజాయి స్మగ్లింగ్ జరిగిందంటూ కలకలం రేపే ఆరోపణలు చేశారు.

డ్వాక్రా సంఘాల నుంచి చెబుతూ.. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలోనే డ్వాక్రా సంఘాల్ని ఏర్పాటు చేశారని.. వైఎస్ హయాంలో ఆ సంఘాలకు పావలా వడ్డీ రుణాల్చి ప్రోత్సహించారని.. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘాలకు వెన్నుపోటు పొడిని వారి సొమ్ముల్ని దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని.. వారి ద్రష్టిలో ఆయనో మోసగాడిగా నిలిచిపోతాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. కొడాలి వ్యాఖ్యలు కలకం రేపేలా ఉన్నాయి. మరి.. వీటికి బాబు అండ్ కో కానీ.. జనసేనాని కానీ ఏమైనా స్పందిస్తారో చూడాలి.