Begin typing your search above and press return to search.
విశాఖకు పవన్ వచ్చారు.. మరి మీరు రాలేదేంటి నాని?
By: Tupaki Desk | 1 Nov 2021 12:30 PM GMTఅందుకే అంటారు రాజకీయాల్లో ఉన్న వారు.. ఉన్నత స్థానాల్లో ఉండే వారు ఆచితూచి మాట్లాడాలని. కానీ.. అందుకు భిన్నంగా మాట్లాడితే వచ్చే తిప్పలు ఎలా ఉంటాయనటానికి నిదర్శనంగా ఈ మధ్యన మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటం.. మైకు కనిపించినంతనే ఫైర్ కావటం.. వెనుకా ముందు మాట్లాడటం.. సవాళ్లు విసరటం లాంటివి కొంతకాలం వరకు బాగానే ఉంటాయి. ఆ తర్వాతే తిప్పలు ఎదురవుతుంటాయి. కొడాలి నాని ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
ఆ మధ్యన విశాఖ ఉక్కు ఉద్యమం గురించి మాట్లాడిన మంత్రి కొడాలి నాని..జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఉద్యమం చేస్తే తాము వెంట వస్తామన్నారు. విశాఖకు వస్తే.. తాను కూడా వస్తానని వ్యాఖ్యానించారు. తాజాగా విశాఖలో ఉక్కు పరిశ్రమకు సంబంధించి పవన్ గళం విప్పటమే కాదు.. వారం గడువు ఇచ్చి.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్న దానిపై ప్రకటన చేయాలని చెప్పటం తెలిసిందే.
విశాఖ ఉక్కు పరిశ్రమ మీద పవన్ మాట్లాడలేదంటూ.. ప్రశ్నలు సంధించిన కొడాలి నాని.. ఇప్పుడేమంటారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. కొడాలి నానికి దమ్ము.. ధైర్యం ఉంటే విశాఖకు రావాలంటున్నారు. మరో రెండు రోజులు పవన్ విశాఖలో ఉండి.. పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్న వేళ.. కొడాలి నాని విశాఖకు వచ్చే ధైర్యం చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. మరి.. జనసైనికులు వేస్తున్న ప్రశ్నలకు కొడాలి నాని ఏమని బదులిస్తారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.