Begin typing your search above and press return to search.
జగన్ దగ్గర చిరు బృందానికి అవమానం వెనక ఒకే గేటు కథ..!
By: Tupaki Desk | 2 March 2022 7:30 AM GMTనిజమేనా.. ఒక్క గేటే ఉందా? అంత పెద్ద భవనానికి ఒక్కగేటే ఉండడం ఏంటి? మంత్రులు, ముఖ్యమం త్రి అందరూ నడిచి వెళ్లడం ఏంటి? ఇదీ.. ఇప్పుడు నెటిజన్లు ఆసక్తిగా వెతికేస్తున్న విషయం. దీనికి కార ణం ఏంటంటే.. తాజాగా వైసీపీ కీలక నాయకుడు, మంత్రి కొడాలి నాని.. కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై సీఎం జగన్‌తో చర్చించేందుకు చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి బృందం తాడేపల్లికి వచ్చింది.
ఈ క్రమంలో వారు వచ్చిన కార్లను బయటే నిలిపేశారని.. వారిని నడుచుకుంటూ.. లోపలకు వెళ్లేలా చేశారని .. విమర్శలు వచ్చాయి. ఇది పూర్తిగా మెగాస్టార్ బృందాన్ని అవమానించేందుకే.. జగన్ చేసిన ప్రయత్నమని.. ఓ వర్గం మీడియా కన్నెర్ర చేసి కథనాలు రాసుకొచ్చింది. ఇక, తాజాగా దీనిపై మాట్లాడిన మంత్రి కొడాలి నాని.. చిరు బృందం అధికారికంగా.. సీఎం జగన్‌తో కలిసేందుకు వచ్చిందని.. ఈ సమయంలో సీఎం ఎదురువెళ్లివారిని ఆహ్వానించాల్సిన అవసరం లేదన్నారు.
అదే సమయంలో చిరు బృందం వచ్చిన కార్లను బయటే నిలిపివేయడం కూడా ఆశ్చర్యకరమేమీ కాదన్నా రు. చిరు బృందం జగన్ నివాసానికి రాలేదని.. తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చిందని... దీనికి ఒకే ఒక్క గేటు ఉంటుందని.. ఇది చాలా ఇరుకుగా ఉంటుదని. నడిచి వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉంటుందని.. చెప్పారు. అంతేకాదు... సీఎం అయినా.. మంత్రులుగా తామైనా.. అక్కడ కార్లను బయట పెట్టేసి నడుచుకుంటూ వెళ్లిపోతామని చెప్పారు.
దీంతో ఈ విషయంపై నెటిజన్లు ఆసక్తి చూపించారు. తాడేపల్లిలో జగన్ నివాసాన్ని టీడీపీ నేతలు ప్యాలెస్‌తో పోల్చుతారని.. అలాంటి ప్యాలెస్‌కు ఒకే ఒక గేటు.. అది కూడా ఇరుగ్గా ఉండడం ఏంటని... వారు నెట్‌లో తెగ సెర్చ్ చేసేశారు. అయితే.. దీనికి సంబంధించిన వివరాలు నెట్‌లో లేకపోవడం గమనార్హం. మొత్తానికి నెటిజన్ల కాన్స్‌న్‌ట్రేషన్‌ను మాత్రం మంత్రి డైవర్ట్ చేశారనే చర్చ సాగుతుండడం గమనార్హం.