Begin typing your search above and press return to search.
పెట్రో ధరల తగ్గింపుపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని
By: Tupaki Desk | 9 Nov 2021 5:30 PM GMTఅంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరల తగ్గింపుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైనా పట్టించుకోని మోడీ సర్కారు.. ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వెనక్కి తగ్గటమే కాదు.. ప్రజా వ్యతిరేకతను పెంచేస్తున్న పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. లీటరు పెట్రోల్ మీద రూ.5.. డీజిల్ మీద రూ.10 చొప్పున తగ్గించిన కేంద్రం నిర్ణయంపై కొంత సానుకూలత వ్యక్తమైంది. అదే సమయంలో.. తొలుత బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఆ తర్వాత బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు సైతం కేంద్రం తగ్గింపునకు అదనంగా తాము వసూలు చేసే వ్యాట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
ఈ నేపథ్యంలో రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న వ్యాట్ ను ఎప్పుడు తగ్గిస్తాయన్న ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. మిగిలిన రాష్ట్రాల మాదిరి తెలుగు ముఖ్యమంత్రులు సైతం పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గించాలన్న డిమాండ్ ఎక్కువైంది. రెండు తెలుగురాష్ట్రాల్లోని బీజేపీ నేతలు సైతం పెట్రోల్.. డీజిల్ మీద విధించే వ్యాట్ ను తగ్గించాలంటూ డిమాండ్లు చేయటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్.. డీజిల్ మీద వ్యాట్ ను తగ్గించాలని అనుకోవటం లేదన్నారు.
'అసలు మేమెందుకు తగ్గించాలి? వ్యాట్ తగ్గించి మా ఆదాయాన్ని ఎందుకు కోల్పోవాలి?' అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. తిరుపతి.. బద్వేల్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదని.. దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ చిత్తుగా ఓడిపోయిందన్నారు. బీజేపీ అరాచకాల పార్టీ అని.. కుల మతాలు రెచ్చగొట్టే పార్టీ అని.. ఎన్నికల్లో డిపాజిట్లుకూడా రావటం లేదెందుకో ఆలోచించాలన్నారు. పెట్రోల్ ధరల ప్రభావం బీజేపీ మీద పడిందని.. ఉప ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు పెట్రోల్ పోసి తగలెట్టారన్నారు. ఓడిపోయింది కాబట్టే పెట్రోల్.. డీజిల్ ధరల్ని కేంద్రం తగ్గించిందన్నారు.
''బీజేపీ.. జనసేన.. టీడీపీలు కలిసి పని చేసినా జగన్ ను ఏమీ చేయలేరు. ఇక్కడ మేకలు.. నక్కలు ఏమీ లేవు. పులివెందుల పులి జగన్. కేంద్రాన్ని అడగాల్సినవి రాష్ట్రాన్ని అడుగుతారా?పెట్రోల్.. డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించేది లేదు'' అంటూ తేల్చి చెప్పారు. ప్రభుత్వం పెట్రోల్.. డీజిల్ రేట్లు తగ్గించాలని ఏపీ బీజేపీ నేతలు సిగ్గు లేకుండా అడుగుతున్నారని.. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెట్రోలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయో చెప్పాలంటూ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. మొత్తానికి ఏపీ బీజేపీ నేతలకు చురుకు పుట్టేలా చేసిన కొడాలి నాని మాటలకు ఏపీ కమలనాథులు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.