Begin typing your search above and press return to search.
భువనేశ్వరి అమ్మ ను నేనేమీ అనలేదు..
By: Tupaki Desk | 16 Nov 2015 8:33 AM GMTతన మీద వెల్లువెత్తుతున్న ఆరోపణలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వివాదంతో తాను ఏపీ ముఖ్యమంత్రి చాంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద ఆరోపణలు చేసినట్లుగా వస్తున్న వాదనను కొట్టిపారేశారు.
పార్టీ కార్యాలయానికి సంబంధించిన వివాదంలో తాను అమ్మగా పిలిచే చంద్రబాబు సతీమణిపై తానేమీ అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎన్టీఆర్ ను తాను దైవంగా భావిస్తానని.. ఆయన కుమార్తె అయిన భువనేశ్వరిని తాను ఎప్పుడూ అనుచితంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. గుడివాడ పార్టీ కార్యాలయం విషయంలో.. చంద్రబాబు సతీమణి వద్దకు వెళ్లి చెప్పటంతో.. ఈ పరిస్థితి ఎదురైందన్న మాటను మాత్రమే వ్యాఖ్యానించాను తప్పించి.. ఎలాంటి విమర్శ చేయలేదన్నారు.
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు.. భువనేశ్వరిని అమ్మగా పిలిచే తాను.. ఆమెను కించపరిచేలా వ్యాఖ్యలు చేసే పరిస్థితి ఎప్పటికి రాదన్నారు. తాను పార్టీ మారనని.. జగన్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఒకవేళ తాను కానీ వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే.. రాజకీయాలు మానేస్తాను తప్పించి మరో పార్టీలో చేరే అవకాశం లేదన్నారు. తనకు జగన్ అధినాయకుడని.. ఆయనేం చెబితే అది చేస్తామన్నారు. ఆయన గంగలో దూకమంటే గంగలో దూకుతానని.. పైకి పొమ్మంటే పైకి పోతానంటూ కొడాలి నాని ప్రకటించటం గమనార్హం.