Begin typing your search above and press return to search.
నేలకు బాబు ముద్దు.. కొడాలి నాని సెటైర్లు
By: Tupaki Desk | 28 Nov 2019 11:37 AM GMTఅమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడ రాజధాని కోసం శంకుస్థాపన చేసిన చోటుకు చేరుకొని నేలకు ముద్దుపెట్టడం వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించాడు. ఆ ఫోటోలు వైరల్ కావడంతో చంద్రబాబుపై కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు.
చంద్రబాబు ఇన్నాళ్లు గ్రాఫిక్స్ ను ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడని.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను గాలికి వదిలేసిన బాబు ఇప్పుడు నేల గుర్తొచ్చి ముద్దులు పెడుతున్నాడని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. అధికారం పోయాక ప్రజలు గూబ గుయ్యిమనిపించారన్నారు. రైతులను మోసం చేసినందుకు ఈరోజు చెప్పులేసి తరిమికొట్టారని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రాజధాని పేరుతో ఏ కట్టడం నిర్మించలేదని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అమరావతిలో పర్యటిస్తున్నాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నిష్ట దరిద్రుడని.. అందుకే రాజధాని పరిధిలో మూడు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఓడించారని విమర్శించాడు.
దళితులు, రైతుల నుంచి భూములు కొట్టేసిన గుండాలు, రౌడీలతో వచ్చి చంద్రబాబు రాజధానిలో తిరుగుతున్నారని మంత్రి కొడాలి విమర్శించారు.
ఇప్పటికే చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ రైతులు ఫెక్సీలు ఏర్పాటు చేసిన నిరసన తెలిపారు. ఆయన పర్యటనను అడ్డుకుంటూ చెప్పులేసినట్లు తెలిసింది. బాబు పర్యటన ఈసారి అమరావతిలో ఉద్రిక్తతకు దారితీసింది.