Begin typing your search above and press return to search.

వైజాగ్ క్యాపిటల్ అయితే బాగుపడేదే కమ్మోళ్లే - కొడాలి

By:  Tupaki Desk   |   20 Jan 2020 4:22 PM GMT
వైజాగ్ క్యాపిటల్ అయితే బాగుపడేదే కమ్మోళ్లే - కొడాలి
X
కమ్మవాళ్లపై జగన్ దండయాత్ర ... అన్న కోణంలో కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాలను పలువురు విశ్లేషిస్తున్నారు. ఆ రాతలను, కోతలను ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కొడాలి నాని పటాపంచలు చేశారు. జగన్ ను కమ్మవారి శత్రువుగా చిత్రీకరిస్తున్న వైనంపై కొడాలి నాని తనదయిన విశ్లేషణ చేసి జరుగుతున్నది అంతా దుష్ప్రచారం అని తేల్చేశారు. కమ్మవాళ్లపై పగ సాధించాలనుకునే వ్యక్తి అయితే... కమ్మలు ప్రభావిత స్థాయిలో ఉన్న వైజాగ్ ను ఎందుకు క్యాపిటల్ చేస్తారు అంటూ కొడాలి నేరుగా ప్రశ్నించారు.

కొడాలి ప్రసంగంలో ఎల్లో మీడియాకు, తెలుగుదేశానికి చురకలు తగిలాయి. జనాల మెదళ్లలో వారు పేర్చిన తుప్పును తన మాటలతో కొడాలి కడిగేశారు. నేరుగా కమ్మ వర్గం అని ప్రస్తావన తెచ్చి... నేను ఆ కులానికి భరోసా ఇస్తున్నాను అంటూ చెబుతూ రాజధాని తరలింపు కమ్మలకు ఎందుకు వ్యతిరేకం కాదు అనే విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించారు కొడాలి నాని.

ఆయన మాటల్లో చెప్పాలంటే...

విశాఖపట్నం నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం వల్ల కమ్మ వాళ్లకు నష్టం లేదు. విశాఖలో కమ్మలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన సంపన్నులకే కాదు, సాధారణ వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆస్తులు కలిగి ఉన్నారు. అక్కడ హాస్పిటాలిటీ రంగం మొత్తం కమ్మవర్గం చేతిలోనే ఉంది. విద్యాసంస్థలు, ఆస్పత్రులు కమ్మవాళ్లవి ఉన్నాయి. గీతం సంస్థలు బాబు బంధువులవే కదా. అంతెందుకు రామోజీ రావుకు కూడా అక్కడ పెద్ద సంఖ్యలో ఆస్తులున్నాయి. అక్కడ గత నాలుగు టెర్ముల్లో గెలిచిన ఎంపీలంతా కమ్మవారే. ఎంతో మంది కమ్మ నేతలు , కమ్మ వ్యాపార వేత్తలు అక్కడి నుంచి పుట్టుకువచ్చారు. మరి ఆ వర్గానికి వ్యతిరేకం అయితే... జగన్ వైజాగ్ కు తరలించేవారు కాదు. అసలు వైజాగ్ క్యాపిటల్ అయితే లాభపడేది కమ్మవాళ్లే. ఇదీ కొడాలి నాని వాగ్దాటి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి భిన్నమైన విశ్లేషణ చేసి కొడాలి నాని అందరినీ విస్మయానికి గురించేశారు.

ఇక పనిగట్టకుని జగన్ గురించి జగన్ తండ్రి ప్రస్తావన తెచ్చి తిట్టేవారికి, తిట్టిస్తున్న వారికి కూడా కనువిప్పు కలిగే విశ్లేషణ చేశారు కొడాలి నాని. కొంతకాలంగా వైఎస్ మరణంపై ఒక విచిత్రమైన ప్రచారం చేస్తున్నారు... వైఎస్ వంటి చావు నాకు వస్తే నేను ఆనందంగా స్వీకరిస్తాను. వైఎస్ చేసినవి మంచి పనులు కాబట్టే ఈరోజు 151 సీట్లు గెలిచే ప్రతిష్ట జగన్ జగన్ కి దక్కిందని, జగన్ పరువు ప్రతిష్టలు పెరుగుతూ పోతుంటే... అద్భుతమైన స్థాయిలో ఉన్న తెలుగు దేశం ప్రతిష్ట దిగజారుతూ 23 సీట్లకు పతనమై పోయిందని విశ్లేషించారు కొడాలి నాని. వైఎస్ కనుక తప్పులు చేసి ఉంటే జగన్ అనే వ్యక్తి సోదిలో ఉండేవారు కాదని...ఎప్పటికపుడు అన్నీ మరిచిపోయే జనాలు వైఎస్ మరణం తర్వాత పదేళ్లయినా కూడా మళ్లీ మళ్లీ తమ రుణం తీర్చుకోవడానికే జగన్ కు ఇంత మద్దతు తెలిపారని అన్నారు. కొడాలి నాని తన విశ్లేషణతో వైఎస్, వైఎస్ జగన్ ల వ్యక్తిత్వాలపై విమర్శలకు ఆలోచననే మార్చే స్థాయిలో ఉంది.