Begin typing your search above and press return to search.
క్యాసినో పై నిజం చెప్పేసిన కొడాలి నాని!?
By: Tupaki Desk | 26 Jan 2022 7:35 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన గుడివాడ క్యాసినో ఎపిసోడ్ ఇప్పుడు భారీ టర్న్ తీసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు నాన్ స్టాప్ వినోదానికి వీలుగా.. భారీ సెట్టింగ్ తో గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ లో గోవా మార్కు క్యాసినో పెట్టిన వైనంపై పెద్ద ఎత్తు వీడియోలు సోషల్ మీడియాను భారీగా ముంచెత్తాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి వేళ.. ఏపీ విపక్షం క్యాసినో అంశాన్ని బలంగా ప్రశ్నించటంతో.. ఈ ఇష్యూ మీద రచ్చ మొదలైంది.
అయితే.. గుడివాడలోని తన కన్వెన్షన్ సెంటర్ లో ఎలాంటి క్యాసినో జరగలేదని.. అదంతా ప్రత్యర్థి పార్టీల వారి కుట్రగా మంత్రి కొడాలి నాని ఇప్పటికే పలుమార్లు చెప్పటం తెలిసిందే. ఎక్కడో జరిగిన వీడియోక్లిప్పుంగుల్ని తీసుకొని.. వాటిని అతికించి వైరల్ చేస్తున్నారని ఆయన మండిపడటం తెలిసిందే. అంతేకాదు.. గుడివాడలో అసలేం జరగలేదని ఒకసారి.. కోడి పందాలు మాత్రమే జరిగాయని మరో పక్క చెప్పటం తెలిసిందే.
గుడివాడ క్యాసినో ఎపిసోడ్ పై జరుగుతున్న రాజకీయ రచ్చ నేపథ్యంలో స్పందించిన మంత్రి కొడాలి నాని సంచలన స్టేట్ మెంట్లు ఇవ్వటం తెలిసిందే. గుడివాడలో క్యాసినో లాంటివి జరిగినట్లుగా తెలిస్తేతాను వెంటనే తానే పోలీసులకు ఫోన్ చేసి చెబుతానంటూ చెప్పటం తెలిసిందే. అంతేకాదు.. తనకు చెందిన కే కన్వెన్షన్ లో క్యాసినో జరిగినట్లుగా నిరూపిస్తే.. తాను రెండు లీటర్ల పెట్రోలో తో తనను తాను నిప్పు అంటించుకొని చచ్చిపోతానని సంచలన స్టేట్ మెంట్ ఇవ్వటం తెలిసిందే. దీనికి కౌంటర్ గా పలు వీడియోలు వైరల్ అయ్యాయి.
మరో సందర్భంలో ఎక్కడో షూటింగ్ చేసి.. వాటిని గుడివాడలోజరిగినట్లుగా చెబితే తానేం చేయాలంటూ ఆగ్రహంతో ఎదురు ప్రశ్న వేయటం తెలిసిందే. ఇలా అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేస్తూ.. సవాళ్లు విసురుతూ.. రచ్చ రచ్చ చేయటంలో ముందున్న మంత్రి కొడాలి నాని.. తాజాగా ఒక ప్రైవేటు చానల్ నిర్వహించిన డిబేట్ లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుడివాడ క్యాసినో గురించి చర్చ రావటం.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగటం తెలిసిందే. అయితే.. తన అధినేత జగన్ మాదిరి మాట తప్పను.. మడమ తిప్పను లాంటి మాటలు తనకు సూట్ కావన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారని చెప్పాలి. తన మీద ఉన్న ప్రేమతో టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. గుడివాడలో పెట్టించారన్నారు. ఇలా ఏ మూడ్ లో ఉన్నారు కానీ.. మనసులో జరిగిన దానిని.. తన మాటల్నియధాలాపంగా చెప్పేయటం ద్వారా.. ఇప్పటివరకు గుడివాడలో క్యాసినో ఎపిసోడ్ ఆయన మాట్లాడిన మాటలు.. మాటల్ని తిప్పే వియయంలో కొడాలి ప్రదర్శించిన ప్రావీణ్యత ఇప్పుడు అందరికి తెలిసిపోయేలా మారింది. ఈ మాత్రం దానికి.. ఇంతకాలం కవరింగ్ మీద కవరింగ్ చేసుడెందుకు? అన్నమాట వినిపిస్తోంది.