Begin typing your search above and press return to search.
త్వరలో 175 నియోజకవర్గాలలో సీట్లు అనౌన్స్ చేయబోతున్న కొడాలి నాని...?
By: Tupaki Desk | 1 July 2022 10:30 AM GMTవైసీపీ అధినేత జగన్ అన్న సంగతి తెలిసిందే. ఆయన వైసీపీ పార్టీ పెట్టింది అన్ని కష్టాలు అనుభవించింది బాధలు పడింది అధినేతగా ఉన్నది ఎందుకోసం. ఈ ప్రశ్న ఇపుడు ఎందుకు అంటే జగన్ ది అధినాయకుడు అయితే మాజీ మంత్రి కొడాలి నాని ఆ పార్టీలో టికెట్లు వరసబెట్టి ఇచ్చేస్తున్నారు. ఇదేమి లెక్క అని అనుకోకపోతే మాత్రం ఒక్క సారి ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో జరుగుతున్న ప్లీనరీలు చూస్తే కొడాలి నాని టికెట్ల పంచుడుగానే మొత్తం కార్యక్రమం సాగుతోంది అని చెప్పాలి.
జగన్ చూస్తే పారిస్ టూర్ లో ఉన్నారు. ఆయన అలా అటు వెళ్లగానే ఇటు పార్టీలోని ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అలా ఒక్కొక్క నాయకుడు టికెట్ల గురించి మాట్లాడుతున్నారు. టికెట్లు ఫలానా వారికే అంటూ ప్లీనరీలో తాముగానే ప్రకటించుకుంటూ పోతున్నారు. తమ ఇష్టానుసారం అలా చేసుకుంటూ వైసీపీ నేతలు ఎలా వెళ్తున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
దానిలో భాగమే ఇపుడు వైసీపీలో అలజడి అలా మొదలైంది అని అంటున్నారు. లేటెస్ట్ గా చూస్తే గన్నవరంలో జరిగిన వైసీపీ ప్లీనరీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకే అని కొడాలి నాని ప్రకటించేశారు. ఇలా ప్రకటించడం వెనక ఆయనకు ఉన్న ధైర్యం ఏమిటని కూడా చర్చకు వస్తోంది.
ఎటూ జగన్ ఏపీలో లేడు అని ఇలా టోటల్ 175 నియోజకవర్గాలకు కొడాలి నాని సీట్లు ప్రకటించుకుంటూ పోతారేమో అని కామెడీగా కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. నాడు చూస్తే లోకేష్ 2014-2019 మధ్యలో చేసిన తప్పిదమే వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకువచ్చి టీడీపీలోకి చేర్చడం. ఇక ఏపీలో వైసీపీ లేకుండా చేస్తామని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాని మీద కామెంట్స్ పెట్టి రచ్చ చేయడం వల్లనే దాని ఫలితమే 2019 ఎన్నికల వేళకు టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి అని అంటున్నారు.
ఇపుడు చూస్తే టీడీపీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేల మీద లోకల్ గా టీడీపీ క్యాడర్ గుర్రుగా ఉన్నారు అని అంటున్నారు. అలాగే ప్రజలు సైతం వారి మీద మండిపడుతున్నారు అని అంటున్నారు. నాడు జగన్ని తిట్టిన వంశీ ఓట్లు అడిగారు అని ఇపుడు చంద్రబాబుని తిట్టి ఓట్లు అడిగితే ఎలా వేయాలి అని కూడా చర్చ జనాల్లో నడుస్తోంది.
ఇక ఈ రోజు వైసీపీ పచ్చగా ఉందని చేరిన వంశీ లాంటి వారు రేపటి రోజున వైసీపీ ఓడిపోతే జగన్ని తిట్టరు అని గ్యారంటీ ఏమైనా ఉందా అని అంటున్నారు వైసీపీలోని హార్డ్ కోర్ నాయకులు. ఇలా జంపింగ్ లీడర్లకు టికెట్లు ఇచ్చుకుంటూ పోతే టీడీపీ పరిస్థితే వైసీపీకి కూడా వస్తుంది అని అంటున్నారు. ఇదేమి చోద్యం బయట నాయకులను తెచ్చి టికెట్లు ఇవ్వాలనుకోవడం అని కూడా గ్రామాలలో వైసీపీ నాయకులు అంటున్నారు.
ఇదిలా ఉంటే అధినాయకుడు జగన్ ప్రమేయం లేకుండా కొడాలి నాని వంశీకే టికెట్ అని ప్రకటించడమేంటి అని అంటున్నారు. నిజానికి గన్నవరంలో వైసీపీ నిర్మాణంలో యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు మొదటి నుంచి ఉన్నారు. ఈ ఇద్దరూ వంశీ మీద పోటీ చేసి గెలుపు దగ్గరకు వచ్చారు. ఈసారి తమలో ఎవరో ఒకరిని టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తామని కూడా అంటున్నారు. ఈ సీటు మీద ఇపుడే పంచాయతీ పెట్టి వంశీకే టికెట్ అని చెప్పడం ద్వారా తొలి నుంచి పార్టీలో ఉన్న వారిని గెంటేయాలనుకుంటున్నారా అన్న ఆగ్రహం కూడా గన్నవరం లోని వైసీపీ నేతల నుంచి వస్తోంది.
మరో వైపు పేర్ని నాని కొడాలి నానికి మంచి మిత్రుడు అన్నది తెలిసిందే. ఆయన సీటు అయిన మచిలీపట్నంలో తిరిగి పేర్ని నాని పోటీ చేస్తారని, లేక ఆయన కుమారుడు పేర్ని క్రిష్ణమూర్తి పోటీకి దిగుతారు అని కొడాలి నానే చెప్పేస్తూండడం కూడా వింతగా ఉందని అంటున్నారు. అలాగే గుడివాడలో తాను 2024లోనే కాదు, 2029లోనూ పోటీ చేస్తాన్ని మరో ఏడేళ్లలో జరిగే ఎన్నికలకు కూడా టికెట్ తానే ఇచ్చేసుకుంటున్న కొడాలి నాని తన దూకుడుతో వైసీపీకి నిజంగా మేలు చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.
మొత్తానికి ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో అసలే టీడీపీకి మంచి రోజులు వచ్చేశాయి. ఇపుడు దానికి తోడు జంపింగ్ లీడర్స్ ఒక వైపు మరో వైపు కొడాలి నాని వాచాలత్వంతో అసలు వైసీపీని ఏం చేస్తున్నారు అన్నది పార్టీలో గట్టిగానె నాయకులు మధ్య అన్న చర్చ అయితే ఉంది మరి.