Begin typing your search above and press return to search.
కొడాలి నాని వర్సెస్ నిమ్మగడ్డ ... మంత్రి కొడాలి నాని పై కేసు !
By: Tupaki Desk | 13 Feb 2021 11:30 AM GMTఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని , ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య వార్ నడుస్తుంది. మంత్రి నానిపై ఎస్ ఈ సీ సీరియస్ గా స్పందించింది. మీడియాతో మరోసారి చేసిన వ్యాఖ్యలతో ఆయనపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఎస్ ఈసీ ని బెదరించారనే అంశంపై కొడాలిపై కేసులు పెట్టాలని కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద నానిపై ఐపీసీ సెక్షన్ 504, 505(1) (c), 506 లగా కేసు నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు క్లాజ్-1, క్లాజ్-4 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
మంత్రి నానిపై ఎస్ఈసీ తాజాగా జారీ చేశారని ఆదేశాలు సంచలనంగా మారాయి. రేషన్ సరుకుల డోర్ డెలివరీ అంశంపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి కొడాలి నాని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు చేశారు. చంద్రబాబు చెప్పినట్లు ఎస్ ఈ సీ నడుస్తున్నారని.. జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవడం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా చంద్రబాబును, నిమ్మగడ్డను పిచ్చాసుపత్రికి పంపాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీరియస్ అయిన ఎన్నికల కమిషనర్.. మంత్రి ప్రెస్ మీట్ ముగిసిన గంటలోనే ఆయనకు షోకాజ్ నోటీసులు పంపి వివరణ కోరింది.ఎస్ఈసీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన మంత్రి కొడాలి నాని, తాను వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ను గానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను గానీ దూషించలేదని పేర్కొన్నారు.
మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఒకటి రెండు మాటలు అని ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీరుపై ప్రజల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించానే తప్ప, వ్యక్తగతంగా దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నాని స్పష్టం చేశారు. కావున తాను చేసిన వ్యాఖ్యలు మరోసారి పరిశీలించి షోకాజ్ నోటీసులు వెనక్కితీసుకోవాలని వివరణ లేఖలో ఎస్ ఈసీ కి విజ్ఞప్తి చేశారు.
మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని ఎస్ ఈ సీ చర్యలు తీసుకుంటూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి మీడియాతో మాట్లాడరాదని ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21 వరకు మంత్రి మీడియాతో మాట్లాడకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటివరకు ఎటువంటి సభలు, సమావేశాల్లోనూ మాట్లాడకూడదన్నారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకొస్తాయని, ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, విజయవాడ పోలీస్ కమిషనర్లు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పుడు తాజాగా కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేశారు.