Begin typing your search above and press return to search.

పవన్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన కొడాలి నాని.. అది ఏ సినిమానో తెలుసా?

By:  Tupaki Desk   |   14 Nov 2022 12:31 PM GMT
పవన్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన కొడాలి నాని.. అది ఏ సినిమానో తెలుసా?
X
జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఒంటికాలిపై లేస్తూ విమర్శలు గుప్పించే మాజీ మంత్రి కొడాలి నాని.. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ సినిమాను కొని డిస్ట్రిబ్యూట్ చేసి లాభాలు సంపాదించాడన్న విషయం తెలుసా? అది జరిగింది. పవన్ ను తిట్టే కొడాలి నాని.. ఆయన సినిమానే కొని లాభపడ్డారన్నది నిజంగా నిజం.

పవన్ కళ్యాన్ ను అభిమానించే సెలబ్రెటీలు చాలా మంది టాలీవుడ్ లో ఉన్నారు. ఆరాధించే వ్యక్తులు కూడా ఉన్నారు. బండ్ల గణేష్ , అలీ లాంటి వారికి పవన్ అంటే ఇప్పటికీ అభిమానం. అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చాక ఆ పరిస్థితి మారింది. అభిమానించే వారే తిడుతున్నారు.

ప్రస్తుతం జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తూ తన గళం వినిపిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అక్రమాలపై ప్రశ్నిస్తున్నాడు. ఒకప్పుడు పవన్ ను అభిమానించిన మంత్రులు రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, మాజీ మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు వంటి వారు పవన్ పై మాటల దాడి చేస్తున్నారు.

అయితే వీరందరూ గతంలో పవన్ సినిమా హీరోగా ఉన్నప్పుడు అభిమానించిన వారే కావడం గమనార్హం. ముఖ్యంగా తీవ్రంగా తిడుతున్న కొడాలి నాని అయితే పవన్ సినిమాను కొని డిస్ట్రిబ్యూట్ చేసి లాభపడ్డాడట..

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాను కృష్ణా జిల్లాలో కొని కొడాలి నాని విడుదల చేశాడట.. ఈ వార్త ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఎగ్జిబిటర్ గా పనిచేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘జల్సా’ మూవీని కొనుగోలు చేశాడట.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అప్పట్లో ఓ రేంజ్ లో సూపర్ హిట్ అయిన జల్సా అప్పటి వరకూ ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ ను బీట్ చేసింది.

కృష్ణా జిల్లాలో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా జల్సా సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అనంతరం నిర్మాతగా మారిన కొడాలి నాని తన స్నేహితుడైన జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి ఓ సినిమాను కూడా తీశాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.