Begin typing your search above and press return to search.

కొడాలి ఫైర్.. మరదలు సూసైడ్ ను డైవర్టు చేసేందుకే మాధవ్ వీడియోలు

By:  Tupaki Desk   |   14 Aug 2022 4:34 AM GMT
కొడాలి ఫైర్.. మరదలు సూసైడ్ ను డైవర్టు చేసేందుకే మాధవ్ వీడియోలు
X
ఏపీ రాజకీయాల్ని హాట్ హాట్ గా మార్చేసింది హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం. ఆయనకు చెందిన అశ్లీల వీడియో మీద అధికార తెలుగుదేశం చేస్తున్న ఘాటు ఆరోపణలు.. అందుకు కౌంటర్ గా వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో వాతావరణం మరింత వేడెక్కింది. ఎంపీ మాధవ్ కు సంబంధించిన బూతు వీడియో అసలైనదనేనని.. ఒరిజినల్ అని.. ఎలాంటి మార్ఫింగ్.. ఎడిట్ చేయలేదంటూ అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు ఇప్పుడీ విషయాన్ని మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఇలంటి వేళ మాజీ మంత్రి.. ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలకు మరో అడుగు ముందుకేసి.. నోరు విప్పితే చాలు బండ బూతులు తప్పించి.. మరింకేమీ మాట్లాడని కొడాలి నాని రంగంలోకి దిగారు.ఎంపీ గోరంట్లకు అండగా నిలుస్తూ.. ఆయన మీద అనవసరంగా బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఎప్పటిలానే టీడీపీ అధినేత చంద్రబాబు మీదా.. టీడీపీ నేతల మీద నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లోకాస్తంత అయినా రాయగలిగిన మాటలు.. అది కూడా ఎంతో కష్టంగా మాత్రమే రాసే పరిస్థితి. మిగిలిన మాటల్ని పూర్తిగా పరిహరిస్తూ రాసిన వ్యాఖ్యల్ని చూస్తే.. కొడాలి నాని ఎంతలా బూతులు మాట్లాడారో అర్థమవుతుంది.

''జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పట్టించాలంటే ఇక మాధవ్ వీడియో తప్పించి మరొకటి లేదా? ప్రజా సమస్యలు లేవా? ప్రజల తరఫున పోరాటం చేయలేరా? పోరాటం చేయలేకనే.. ఈ రాష్ట్రంలో ప్రతి సమస్యను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్షుణ్ణంగా పరిశీలించి.. ఏ రకంగా పేదలకు అందుబాటులో ఉండాలని ప్రతి క్షణం పరితపిస్తోంది. ఆ విధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీని భ్రష్టు పట్టించటానికి.. తెలుగుదేశం పార్టీ నేతలు ఆఖరికి బ్రోకర్ల అవతారానికి ఎత్తారు. అమ్మాయిల్ని కూడా ఎర వేయటానికి సిద్ధమయ్యారు'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మాధవ్ ఇబ్బంది పెట్టాడని ఏ మహిళ అయినా వచ్చారా? ఏ మహిళ వచ్చి మాధవ్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లుగా ఫిర్యాదు చేశారా? మీ పార్టీని సంప్రదించిందా? పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసిందా? అని ప్రశ్నించిన కొడాలి నాని.. ''ఈ 420 నాకొడుకులు.. ఈ పనికి మాలిన నా కొడుకులు..చంద్రబాబు లాంటి లఫంగి నాకొడుకు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక ఎంపీని పట్టుకొని పోరంబోకు నాకొడకా అంటున్నారు. ఇదేం భాష?'' అంటూ ఫైర్ అయ్యారు.

ఇక.. గోరంట్ల మాధవ్ వీడియోలంటూ రచ్చ చేస్తున్న వైనం వెనుక మరోకారణం ఉందంటూ కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఈ విషయాన్ని కొడాలి నాని మాటల్లోనే చూస్తే.. ''ఆఖరికి మరదలు ఆత్మహత్యను డైవర్టు చేయటానికి మాధవ్ వీడియోను మార్ఫింగ్ చేసి.. దాన్ని అడ్డంబెట్టుకొని డైవర్టు చేస్తున్న పరమ సన్నాసి చంద్రబాబునాయుడు'' అని విరుచుకుపడ్డారు. వైసీపీ తల.. టీడీపీ బాడీలతోఎడిటింగ్ చేసి వీడియోను రికార్డు చేసి దాన్ని అమెరికా ల్యాబ్ కు పంపితే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జాతీయ జెండా ఎగురవేసే అర్హత లేదన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై విరుచుకుపడిన కొడాలి నాని.. మరింత సీరియస్ కామెంట్లు చేశారు. సైకిల్ గుర్తు కోసం అమ్మాయిలను పంపిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఇప్పుడు అధికారం కోసం దిగజారి అమ్మాయిలను అడ్డం పెట్టుకొని విష ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు చేసిన ఆయన.. 'ఇలాంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉండటం దైర్భాగ్యం. అమ్మాయిలను అడ్డం పెట్టుకొని టీడీపీ కుట్రలు చేస్తుందని ఏడాదిన్నర క్రితమే నిఘా వర్గాల రిపోర్టు వచ్చాయి' అని పేర్కొన్నారు.

గోరంట్ల మాధవ్ వీడియో ఎపిసోడ్ లో ఎవరైనా మహిళ బయటకు వచ్చి తనను వేధిస్తున్నారని కంప్లైంట్ చేసిందా మీరు మాట్లాడటానికి అంటున్న కొడాలి నాని.. చంద్రబాబు పార్టీ గుర్తు కోసం అమ్మాయిల్ని పంపిన వైనంపై ఎవరైనా మహిళ బయటకు వచ్చి.. తనను అన్యాయంగా వాడేశారని చెప్పారా? అన్నది ప్రశ్న. తాను సంధించే ప్రశ్నే తన మాటల కారణంగా తిరిగి ప్రశ్నించేలా ఉండటం చూస్తే.. కొడాలి నాని ఆవేశంతో బ్యాలెన్సుమిస్ అవుతున్నారన్న మాట వినిపిస్తోంది.