Begin typing your search above and press return to search.
సర్కారుపై కోదండరాం ఉద్యమ కార్యాచరణ ఇది
By: Tupaki Desk | 1 Dec 2016 1:51 AM GMTతెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మరోమారు టీఆర్ ఎస్ సర్కారు తీరుపై మండిపడ్డారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన భూనిర్వాసితుల జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండ రాం మాట్లాడుతూ ప్రాజెక్టులు - పరిశ్రమల కోసం ప్రభుత్వం దౌర్జన్యంగా భూములు తీసుకోవద్దన్నారు. నష్టపరిహారం ప్రజలు కోరుకున్నట్లు ఇవ్వాలన్నారు. భూమి కోల్పోయే రైతులు - వాటిపై ఆధారపడే వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, అన్నింటికంటే ముఖ్యంగా డీపీఆర్ లేకుండా ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు తీసుకోవద్దని డిమాంఢ్ చేశారు. భూ నిర్వాసితుల గురించి మాట్లాడితే అభివృద్ధి నిరోదకు లు అనే భావనను ప్రభుత్వం వీడాలని కోదండరాం ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. భూములు కలిగి ఉన్న వారి సమస్యలు వినకుండా దబాయింతో భూములు లాక్కొ వడం సరికాదని కోదండరాం అభిప్రాయపడ్డారు. భూ నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పారు.
ఈ సదస్సు సందర్భంగా తొమ్మిది అంశాలతో నిర్వాసితుల డిక్లరేషన్ ను కోదండరాం విడుదల చేశారు. ఉపముఖ్యమంత్రి - సీఎస్ - రెవెన్యూ కార్యదర్శికి డిక్లరేషన్ పత్రం ఇస్తామన్నారు. భూములను సేకరించే విషయంలో ప్రభుత్వం బహిరంగ విచారణ జరగని చోట డిసెంబర్ 15లోగా సభలు నిర్వహిస్తామని కోదండ రాం ప్రకటించారు. తర్వాత కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసి వినతిపత్రాలు అందజేస్తామన్నారు. అసెంబ్లీ నిర్వహణ సమయంలో ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా చేపడతామని తమ కార్యాచరణను కోదండరాం వివరించారు. కాగా ఈ సమావేశానికి మల్లన్నసాగర్ - కాళేశ్వరం ఎత్తిపోతల పథకం - సింగరేణి ఓపెన్ కాస్ట్ నిర్వాసితులు - మెదక్ లోని నిమ్జ్ నిర్వాసితులు - పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్వాసితులు హాజరయ్యారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/