Begin typing your search above and press return to search.
పాఠాలే కానీ.. నో పాలిటిక్స్ అంట
By: Tupaki Desk | 2 Oct 2015 6:24 AM GMTతెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి.. తెలంగాణ రాష్ట్ర సాధన స్వప్నాన్ని నిజం చేయటంలో ప్రొఫెసర్ కోదండరాం పాత్రను మర్చిపోలేం. ఆయన నేతృత్వం ఏర్పాటు చేసిన రాజకీయ జేఎసీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అత్యంత మేలి మలుపుగా అభివర్ణించొచ్చు.
వివిధ పార్టీలకు చెందిన నేతల్ని ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి.. తెలంగాణ ఉద్యమాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిన కోదండరాం వ్యూహ చతురతను పొగడకుండా ఉండలేం. పార్టీ అధినేతలకు కూడా ఇబ్బంది పడే పార్టీ నేతలందరిని ఒక జట్టుగా ముందుకు నడిపించటం.. తన మాటకు నో చెప్పే సాహసం చేయకుండా ఉండేలా చేయటం అంత చిన్న విషయం కాదు.
అలాంటి ఆయన ప్రొఫెసర్ గా తాజాగా రిటైర్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించి కూడా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదవులు తీసుకోకుండా.. తన పాటికి తాను పాఠాలు చెప్పుకున్న విలక్షణ వ్యక్తిత్వం కోదండరాం సొంతం. అలాంటి ఆయన ప్రొఫెసర్ గా రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తారన్న దానిపై చాలానే వాదనలు వినిపించాయి.
కొంతమంది అయితే.. మరింత వేగంగా ఆలోచించి.. రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారన్న అంచనాలు వ్యక్తం చేయటం జరిగింది. అయితే.. వీటన్నింటికి భిన్నంగా తన రిటైర్ మెంట్ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తాను పాలిటిక్స్ లోకి రావటం లేదని తేల్చేశారు. తనకు పాఠాలు చెప్పటంలో ఉన్న ఆసక్తి పాలిటిక్స్ మీద లేదని.. తాను రాజకీయాల్లోకి రానని చెప్పారు. వీలైనంత కాలం పిల్లలకు పాఠాలు చెప్పటమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు.
మరి.. కోదండరాం పాఠాల వరకే పరిమితం అవుతారా? లేక.. తెలంగాణ లోని రాజకీయ పార్టీలకు తనదైన శైలిలో పాఠాలు చెబుతారా? అన్న ప్రశ్నకు కాలమే సరైన సమాధానం ఇస్తుందని చెప్పక తప్పదు.