Begin typing your search above and press return to search.
కోదండరాంకు కోపం ఎందుకు వచ్చిందంటే...
By: Tupaki Desk | 18 Feb 2017 11:24 AM GMTతెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 22న నిర్వహించనున్న నిరుద్యోగుల ర్యాలీ ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇంటికో ఉద్యోగం, లక్ష ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీ ఇస్తే టీఆర్ ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని అవి నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఈ ర్యాలీకి పిలుపునిచ్చింది. అంతేకాకుండా జోనల్ వ్యవస్థను రద్దుచేస్తే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, అనేక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని, అందుకే జోనల్ వ్యవస్థను రద్దు చేయకుండానే దానిని సవరించాల్సి ఉందని తెలంగాణ జాక్ కోరుతోంది. ఈ నేపథ్యంలో తమకు మేలు చేసే పరిణామంగా భావిస్తూ రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది విద్యార్థులు ర్యాలీకి కదిలి వస్తున్నారు. ముందస్తుగా నగరానికి చేరుకుని 22న ర్యాలీకి హాజరుకావాలని భావిస్తున్న విద్యార్థి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
ర్యాలీని భగ్నం చేసేందుకు పోలీసులు అప్పుడే తమ ప్రయత్నాలు ప్రారంభించి అరెస్టులు చేయడం జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తీవ్రంగానే స్పందించారు. తాము ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించే ర్యాలీలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారిపై లాఠీచార్జి, కాల్పులు జరుగుతాయంటూ భయోత్పాతం సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ర్యాలీకి హాజరయ్యే వారు సంయమనంతో ఉండాలని కోదండరాం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోరాదని లక్షా 7 వేల ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, వీటికి కమల్ నాథన్ కమిటీతో సంబంధం లేదన్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీకి అనుమతి కోరుతూ ఈ నెల 1న నగర పోలీసు కమిషనర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చానని, కమిషనర్ దానిని సెంట్రల్ జోన్ డీసీపీకి పంపించారని సదరు డీసీపీ అనుమతిస్తారన్న నమ్మకం ఉందని కోదండరాం అన్నారు. తన వెనుక ఎవరో అదృశ్యశక్తులు ఉండి నడిపిస్తున్నారన్న దాంట్లో నిజం లేదని అన్నారు. టీ జాక్ స్వతంత్ర సంస్ధ అని, స్టీరింగ్ కమిటీ ఉందని, ఎవరూ నడిపించాల్సిన అవసరం లేదని కోదండ రాం స్పష్టం చేశారు. తనను అవమానిస్తే భరిస్తాను కానీ నిరుద్యోగులను రెచ్చగొట్టవద్దని కోరారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలకూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు అనేక మంది తన దృష్టికి తెచ్చారని కోదండరాం చెప్పారు. మరోపక్క కోదండరామ్ కు విద్యార్థి సంఘాల నుండి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. వామపక్షాలకు అనుబంధంగా ఉన్న ఐదు విద్యార్ధి సంఘాలు సమావేశమై అధికారికంగా మద్దతు ప్రకటించనున్నట్టు ప్రకటించాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/