Begin typing your search above and press return to search.
కోదండరాం మాష్టార్ని అరెస్ట్ చేశారు
By: Tupaki Desk | 25 July 2016 6:21 AM GMTతెలంగాణ రాష్ట్ర సర్కారుకు తలనొప్పిగా మారిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పోరాటంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో తమ భూములు కోల్పోతామంటూ కొన్ని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించటం.. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ లో పలువురుకి తీవ్ర గాయాలు కావటం తిసిందే. మొత్తంగా చూస్తే.. ఆదివారం రాజీవ్ రహదారి రణరంగాన్ని తలపించేలా చేసింది.
ఆదివారం నాటి పోలీసుల దుశ్చర్యను నిరసిస్తూ.. ఈ రోజు(సోమవారం) మెదక్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు రాజకీయ పక్షాలు కూడా తమ మద్ధతు పలికాయి. ఇదిలా ఉంటే.. కొద్దిసేపటి క్రితం మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్ని సందర్శించే నిమిత్తం తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం బయలుదేరి వెళ్లారు. ముంపు గ్రామాల పర్యటనకు వెళుతున్న కోదండరాం మాష్టార్ని పోలీసులు అడ్డుకున్నారు.
ఒంటిమామిడి వద్ద ఆయన్ను అడ్డుకున్న పోలీసులు.. ఆయన్ను ముందుకు వెళ్లేందుకు ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా పోలీసులకు.. జేఏసీ ప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కోదండరాంను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొద్దిసేపు గందరగోళ వాతావరణం చోటు చేసుకోవటం.. చివరకు జేఏసీ నేతల్ని అదుపు చేసిన పోలీసులు.. ప్రొఫెసర్ కోదండం మాష్టార్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్నటికి నిన్న ఆందోళనకారుల మీద లాఠీ ఛార్జ్.. ఈ రోజు రాజకీయ జేఏసీ ఛైర్మన్ ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ ఇష్యూ ఇంకెంత ముదిరిపాకాన పడుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.