Begin typing your search above and press return to search.

కోదండరాం మేధావితనం ఇదేనా?

By:  Tupaki Desk   |   8 Jan 2016 10:35 AM GMT
కోదండరాం మేధావితనం ఇదేనా?
X
విభజనతో తీవ్రంగా నష్టపోయి... ఆ తరువాత కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహాయం అందక విలవిలలాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తెలంగాణ ఉద్యమ మేధావి - జేసేసీ ఛైర్మన్ కోదండరాం అక్కసు వెల్లగక్కారు. కేంద్రం ఆంధ్రాకు ఏదో ఎక్కువగా ఇచ్చేస్తున్నట్లుగా ఆయన మాట్లాడారు. తెలంగాణను కేంద్రం పట్టించుకోకుండా ఆంధ్రకు సాయం చేస్తుందని మాట్లాడారు. తెలంగాణ ఆవేదన కేంద్రంలోని పెద్దలకు అర్దం కావడం లేదని... తెలంగాణకు గత ఆరు దశాబ్దాలుగా జరిగిన అన్యాయం కంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంద్రాకు జరిగిన నష్టమే ఎక్కువ అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అబిప్రాయపడ్డారు.

తెలంగాణకు సంబందించిన ఒక పుస్తక ఆవిష్కరణ సభ లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఆవేదన అర్దం అయితే తప్ప డిల్లీ పెద్దలకు మన బాద ఏమిటో తెలియదని కోదండరామ్ అన్నారు.ఇందుకోసం ఇంగ్లీష్ - హిందీ భాషలలో కూడా తెలంగాణపై పుస్తకాలు రావాలని ఆయన అబిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కేసీఆర్ పట్టించుకోవడం మానేయడంతో పులుసులోకి కూడా కనిపించని కోదండరాం విభజన పూర్తయి ఆయన కోరుకున్న సొంత రాష్ట్రం తెలంగాణ ఏర్పడినా కూడా ఇంకా ఆంధ్రపై ఏడుపు మానడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. లేకుంటే ఆర్థిక లోటుతో నానా ఇబ్బందులు పడుతున్న ఏపీకి కేంద్రం నుంచి సరైన సాయం అందక విలవిలలాడుతుంటే అది కూడా ఎక్కువ అన్నట్లుగా మాట్లాడడం మేధావితనం అనిపించుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు.