Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఆంధ్రప్రేమను బయటపెట్టిన కోదండరాం
By: Tupaki Desk | 20 Jun 2017 5:08 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాజకీయ జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాం పరోక్షంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వరాష్ట్రం కోసం ఉద్యమిస్తే రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రయోజనాలన్నీ ఆంధ్రులకు దక్కుతున్నాయని - ఇందుకు సర్కారు తీరే కారణమని ఆరోపించారు. తెలంగాణ వచ్చిందని సంతోషపడినప్పటికీ మెజార్టీ బ్రతుకుల్లో మార్పు రాలేదన్నారు. అందరి బతుకుల్లో మార్పు రావాలంటే ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమసంఘం ఆధ్వర్యంలో ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ కారులకు తగిన గుర్తింపు లేకుండా పోయిందని అన్నారు.
ఉద్యమం సమయంలో తెలంగాణవాదులపై దాడి చేసిన వారే ఇప్పుడు ముందు వరుసలో ఉండి అధికారాన్ని చెలాయిస్తున్నారని కోదండ రాం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆంధ్ర కాంట్రాక్టర్లకే మిషన్ భగీరథ - మేజర్ ప్రాజెక్ట్ లు ఇస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా జీహెచ్ ఎంసీ చెత్తబుట్టలు సరఫరా చేసే టెండర్లు కూడా వారికే దక్కుతున్నాయని, ఇది ప్రభుత్వం తీరుకు నిదర్శనమని కోదండరాం వ్యాఖ్యానించారు. ఉద్యమకారులు ఆస్తి - పాస్తులను కుటుంబ జీవితాన్ని పొగొట్టుకుని త్యాగాలు చేస్తే ఇప్పుడు వారికి సరైన గుర్తింపు లేదని విమర్శించారు. యువకులు బలిదానాలు చేసి తెలంగాణ సాధిస్తే వారికోసం ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం శోచనీయమని సర్కారు తీరును తప్పుపట్టారు. సంక్షేమ పథకాలలో ఉద్యమకారులకు కోటా ఇవ్వాలని, ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం శూన్యమని కోదండ రాం అన్నారు. రైతులకు నాలుగో విడత రుణమాఫీ డబ్బులు ఇంకా జమకాలేదన్నారు. వడ్డీలు పెరిగి రైతుల ఆత్మహత్యలు చేసుకున్నా వారి కుటుంబాలను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల తరుపున మాట్లాడేందుకు జేఏసీ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/