Begin typing your search above and press return to search.
కేసీఆర్ మనుమడి కోసమే కేసీఆర్ కొత్త ఆఫీసు
By: Tupaki Desk | 15 July 2017 10:34 AM GMTఇందిరాపార్క్ వద్ద నుంచి ధర్నాచౌక్ తొలగింపు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మొండిపట్టుపై పలువురు వామపక్ష భావజాల నేతలు మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం - విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు - తెలంగాణ మేధావుల వేదిక నాయకుడు పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు సీఎం తీరును తప్పుపట్టారు. ధర్నా చౌక్ ఎత్తివేయడం పట్ల సమస్యలు సమసిపోతాయని అనుకోవడం సరికాదని కోదండరాం అన్నారు. ఎన్ని విధాలుగా నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం ఉంటుందని ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. అసలు ధర్నా చౌక్ రూపాన్ని ప్రగతి భవన్ ఎప్పుడో సంతరించుకుందని అన్నారు.
తమ ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రగతి భవన్ కు నిత్యం వేలాది మంది నిరసన తెలిపేందుకు వెళ్తున్నారని కోదండ రాం అన్నారు. దీన్ని పత్రికలు రాసిన రాయకపోయిన జరుగుతోంది ఇదేనని తెలిపారు. ధర్నా చౌక్‌ను పరిరక్షించాలని కోరుతూ 22న ఢిల్లీలో జరిగే నిరసనకు అన్ని సంఘాల మద్దతు కూడగడుతామని కోదండరాం చెప్పారు. జాతీయ స్థాయిలో ధర్నా చౌక్ అవశ్యకతని చాటి చెప్తామన్నారు. నిరసన తెలిపే హక్కును ప్రతి ఒక్కరిదని అందుకే ఇందులో అందరి భాగస్వామ్యం ఉంటుందని అన్నారు. సెక్రటేరియేట్ తరలింపు అనేది రియల్ ఎస్టేట్ కోణంలో మాత్రమే జరుగుతోందని దీన్ని ముక్తకంఠంతో అందరూ వ్యతిరేకించాలని కోరారు.
విప్లవ రచయితల సంఘం నాయకుడు వరవరరావు మాట్లాడుతూ కేసీఆర్ సామ్రాజ్య వాద ఏజెంట్లలాగా పనిచేస్తూ ప్రజల హక్కులు హరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు వెచ్చిన క్యాంపు కార్యాలయం కట్టుకొని ప్రజలను దగ్గరికి రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఓ కుటుంబం సీఎంకు తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చి మూడు రోజులు వేచిచూసినా కలిసే అవకాశం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. క్యాంపు కార్యాలయం ప్రజలకోసమా సీఎం మనుమడి కోసమా అని ప్రశ్నించారు. ఢిల్లీలో ధర్నా చౌక్ గా జంతర్ మంతర్ కొనసాగుతోంది కానీ...ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్ ను ఫాసిస్టు మనస్తత్వంతో సీఎం కేసీఆర్ రద్దు చేశారని మండిపడ్డారు. సమాజహితం కోరుకునే వారిలో మేధావులు ముందు ఉంటారని, అలాంటివారిని గౌరవించుకోవడం మన బాధ్యత అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. అయితే దానికి పూర్తి విరుద్ధంగా తెలంగాణలో పాలన నడుస్తోందని మండిపడ్డారు. నిరసన అనే పదం వింటేనే ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలిపే నిరసనకు దేశవ్యాప్త మద్దతునూ తీసుకు రావాలన్నారు. ఇక్కడి పాలన చూస్తుంటే...ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయని అన్నారు.