Begin typing your search above and press return to search.
కేసీఆర్, పవన్ భేటీపై కోదండరాం సెటైర్ ఇదే
By: Tupaki Desk | 2 Jan 2018 5:31 PM GMTనూతన సంవత్సరం సందర్భంగా...తెలంగాణ సీఎం కేసీఆర్ తో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్న భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 24 గంటల కరెంటుపై ప్రశంసలు గుప్పించారు. అయితే భేటీపై పలు విమర్శలు తలెత్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు స్పందించగా...తాజాగా, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ఆప్తులు శత్రువులయ్యారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ సచివాయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోదండరాం ఈరోజు కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఒకరినొకరు తిట్టుకున్న కేసీఆర్, పవన్ కలిసిపోయారని వ్యాఖ్యానించారు. శత్రువులు ఆప్తులయ్యారు, ఆప్తులు శత్రువులయ్యారని అన్నారు విద్యుత్ సరఫరా విషయంలో పవన్ నిజాలు తెలసుకోవాలని సూచించారు. తెలంగాణలో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించి, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం సబబు కాదని, రూ.3.50కు యూనిట్ విద్యుత్ దొరుకుతుంటే.. రూ.5.50కు కొనడంలోనే ఏదో మతలబు ఉందని ఆరోపించారు. నిరంతర విద్యుత్ తో భూగర్భజలాలు అడుగంటిపోతాయని కోదండరాం వివరించారు.
ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం సరైన విధానాలు అవలంభించడం లేదని కోదండరాం ఆరోపించారు. టీచర్ పోస్టుల భర్తీలో టెట్ కు లేని నిబంధనలు టీఆర్టీకి ఎందుకని ప్రశ్నించారు. కాంట్రిబ్యూటరీ స్కీమ్ ను రద్దు చేయాలని, ఏపీలో పనిచేస్తున్న నాల్గో తరగతి ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకోసం త్వరితగతిన నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు.