Begin typing your search above and press return to search.
వారు చెప్పింది చేస్తే కేసీఆర్ మొనగాడేనట
By: Tupaki Desk | 18 Jun 2017 7:19 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కమిట్ మెంట్‌కు పెద్ద పరీక్షగా మారింది భూకబ్జాల వ్యవహారం. అవినీతి అన్నది తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదన్న ముఖ్యమంత్రి మాటలకు భిన్నంగా తాజాగా వెలుగు చూసిన భూముల కుంభకోణం వ్యవహారం తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. భూముల కుంభకోణం అంటూ ఏమీ లేదని.. ఆ మాటకు వస్తే.. ప్రభుత్వమే వాటిని బయటపెట్టిందంటూ సీఎం కేసీఆర్.. మంత్రులు కేటీఆర్.. హరీశ్ రావులు చెబుతున్నా.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం డిఫెన్స్ లో పడిందన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు భూ కబ్జాల విషయంలో టీఆర్ ఎస్ కు చెందిన పలువురు నేతల పేర్లు తెర మీదకు రావటం కేసీఆర్ సర్కారుకు చిరాకుగా మారిందన్న మాట వినిపిస్తోంది.
భూకుంభకోణం వ్యవహారం ఎంతగా ముదిరిందంటే.. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధం ఉందంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీనిపై తమదైన రీతిలో సమాధానాలు చెబుతున్నా.. ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతుందే తప్పించి తగ్గటం లేదన్న మాట వినిపిస్తోంది.
సర్కారీ భూములు దురాక్రమణకు గురైన వాటికి సంబంధించి కఠిన చర్యలు తాము తీసుకుంటున్నట్లుగా కేసీఆర్ సర్కారు చెబుతున్న వైనంపై తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ప్రభుత్వ భూములతో కబ్జాదారులు కోట్లు గడిస్తున్నారన్న ఆయన.. కబ్జాకు గురైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా సంక్షేమానికి వినియోగించాలన్నారు.
భూ కబ్జాలు బయటకు వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు భూములపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్ని గుర్తించేందుకు వేసిన ఎస్‌కే సిన్హా కమిటీ నివేదిక ఏమైందంటూ కోదండరాం వేస్తున్న ప్రశ్నలు కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.
అన్యాక్రాంతమైన భూముల్ని రక్షించేందుకు సుప్రీంకోర్టు జడ్జి స్థాయి అధికారితో విచారణ కమిటీ వేయాలన్న ఆయన.. ఆ పని ప్రభుత్వం కాని చేయకపోతే తాము పీపుల్స్ ట్రైబ్యునల్ వేస్తామని హెచ్చరించారు. భూకబ్జాల మీద కేసీఆర్ కమిట్ మెంట్‌ను క్వశ్చన్ చేసేలా ఉన్న మాష్టారి మాటలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందికి గురి చేస్తాయన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/