Begin typing your search above and press return to search.
కోదండరాం కొత్త డిమాండ్ విన్నారా?
By: Tupaki Desk | 27 April 2016 4:32 AM GMTతెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతున్న సమయంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కీలక డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన జేఏసీ సమావేశానికి హాజరయిన అనంతరం జేఏసీ కార్యాచరణపైనే కాకుండా రాజకీయ పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణ జేఏసీలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని కోదండరాం స్పష్టం చేశారు. పాలేరు ఉప ఎన్నికలకు దూరంగా ఉంటున్నామనీ ప్రకటిస్తూ బరిలో నిలిచిన ఏ పార్టీకి మద్దతీయబోమని ఆయన అన్నారు. పార్టీ మారిన నాయకులంతా తమ పదవులకు రాజీనామా చేయాలని కోదండరాం అన్నారు. కరువు మండలాలను ఆదుకునే దిశగా ప్రభుత్వంపై పోరాడతామని స్పష్టం చేశారు.
తాజాగా కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్సీ - ఎమ్మెల్యే గులాబీ గూటికి చేరిన నేపథ్యంలో, ఇతరత్రా వలసలు కూడా కొనసాగుతున్న క్రమంలో తెలంగాణ ఉద్యమకారుడిగా కోదండరాం చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. నిజమైన తెలంగాణవాదిగా ప్రజాసమస్యలపై స్పందిస్తానని చెప్పిన ప్రొఫెసర్ కోదండరాం ఇపుడు రాజకీయ పరిణామాలపై కూడా రియాక్టవడం మారుతున్న పరిస్థితులకు నిదర్శనమని అంటున్నారు.