Begin typing your search above and press return to search.
కోదండరాంది రాంగ్ ఎంట్రీనా ?
By: Tupaki Desk | 9 Jun 2016 9:30 AM GMTతెలంగాణలో పాలేరు ఎన్నికల తరువాత ప్రభుత్వం తన పని తాను సాఫీగా చేసుకుపోతుందని, ఇప్పట్లో ఎన్నికల గొడవ లేదు కాబట్టి అభివృద్ది పనుల మీద దృష్టి సారిస్తుంది అని భావించారు. కానీ హఠాత్తుగా తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం హఠాత్తుగా తెలంగాణ సర్కారు మీద విరుచుకుపడ్డారు.
రెండేళ్లలో అసలు తెలంగాణ అభివృద్ది శూన్యం. ప్రభుత్వాన్ని నడపడం చేతకాకుంటే దిగిపోవాలి. ఎలా నడపాలో మేము చేసి చూయిస్తాం అని తెలంగాణ విద్యావంతుల వేదిక సభలో కోదండరాం అన్నారు. ఇప్పటి వరకు కోదండరాం ను చూసి చూడనట్లుగా వస్తున్న టీఆర్ఎస్ కు ఈ మాటలు ఏ మాత్రం రుచించలేదు.
తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రుల నుండి ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు కోదండరాం మీద ఊహించని విధంగా దాడికి దిగారు. కోదండరాం కూడా ఈ స్థాయిలో దాడిని ఊహించలేదు. సహజంగా అయితే తెలంగాణ సమాజం నుండి కోదండరాంకు మంచి సానుభూతి లభించేది.
కానీ తెలంగాణ వచ్చిన తరువాత కేంద్రం ఎన్ని సార్లు ఇబ్బంది పెట్టినా, విద్యుత్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేసినా, ఉద్యోగుల విభజన, ఆస్తుల విభజన, హైకోర్టు విభజన వంటి విషయాలలో ఎప్పుడూ కోదండరాం నోరెత్తలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఇలా మాట్లాడడంతో ఆయనను తెలంగాణ జనం పట్టించుకోలేదు.
అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, టీడీపీలు అండగా నిలవడం కూడా ప్రజల్లో సానుభూతి రాకపోవడానికి కారణం అయింది. ఉద్యమ సమయంలో నోటికొచ్చినట్లు తిట్టిన రేవంత్ రెడ్డి, కోదండరాం రెడ్డి అంటూ వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇతర ప్రజా సంఘాల నేతలు ఇప్పుడు హఠాత్తుగా ఆయన మీద ప్రేమ కురిపించడం జనాలకు రుచించడం లేదు.
ఇక ప్రభుత్వ దాడితో టీజేఏసీ సమావేశం పెట్టిన కోదండరాం ప్రభుత్వం మీద పోరాడతామని ప్రకటించారు. ప్రాజెక్టుల గురించి, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడిన ఆయన ప్రైవేటు విద్యాసంస్థల మీద దాడులను ఖండించడం, మల్లన్న సాగర్ నిర్మాణం వ్యతిరేకించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సమస్యలకు పరిష్కారం చూపకుండా వ్యతిరేకించడం ఆయన మీద అనుమానాలను రేపుతోంది. మొత్తానికి కోదండరాంది ఇప్పుడు రాంగ్ ఎంట్రీ అని భావించాల్సి వస్తుంది.