Begin typing your search above and press return to search.
కోదండరాంకు షాక్..ఏసీబీకి చిక్కిన కో కన్వీనర్
By: Tupaki Desk | 12 Jan 2018 5:13 PM GMTతెలంగాణ జేఏసీకి అనూహ్యమైన షాక్ తగిలింది. జేఏసీ కో కన్వీర్ ఏసీబీకి చిక్కారు. లంచం ఇస్తూ ఏపీలోని విజయవాడలో జేఏసీ కో కన్వీనర్ గోపాల్ శర్మ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కమర్షియల్ టాక్స్ జేసీకి లంచం ఇస్తూ ఆయన దొరికిపోయారు. భారీగా లంచం తీసుకుంటూ కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ ఏడుకొండలు - అసిస్టెంట్ కమిషనర్ అనంతరెడ్డి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు దొరికారు. వీరిద్దరూ తమ ఛాంబర్ లో ఐటీడీ సిమెంటేషన్ కంపెనీ ప్రతినిధుల నుంచి రూ.23.50 లక్షలు లంచం తీసుకుంటూ శుక్రవారం పట్టుబడ్డారు. ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ సత్యనారాయణ కంపెనీ లీగల్ అడ్వైజర్ గోపాల్ శర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖ - గంగవరం పోర్టుల బెర్తుల నిర్మాణంలో ఐటీడీ సిమెంటేషన్ కంపెనీ పని చేస్తోంది. రూ.4.50 కోట్ల మేర పన్ను రాయితీ ఇప్పించేందుకు ఏడుకొండలు పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఈ మొత్తం ముట్టజెప్పేందుకు కంపెనీ లీగల్ అడ్వైజర్ గోపాల్ శర్మ విజయవాడ రాగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ చరిత్రలో ఇంత మొత్తం పట్టుబడిన మొదటి కేసు ఇదేనని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. లంచం తీసుకున్న వారే కాకుండా.. లంచం ఇచ్చిన వారిపైన కూడా కేసు నమోదు చేస్తున్నామన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో రూ.25లక్షలు చేతులు మారుతున్నట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. నిన్నటి నుంచి నిఘా పెంచామన్నారు. ఉద్యోగులెవరూ లేని సమయంలో కంపెనీ ప్రతినిధులను పిలిచారన్నారు. మరో రూ.2.5లక్షలు చేతులు మారినట్లు తెలిసిందని, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏడుకొండలుతో పాటు సూపరింటెండెంట్ అనంతరెడ్డి, ఇద్దరు కంపెనీ ప్రతినిధులపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా, ఈ పరిణామం తెలంగాణ జేఏసీకి గట్టి ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు. జేఏసీని టార్గెట్ చేసుకునేందుకు ప్రత్యర్తులు ఈ అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.