Begin typing your search above and press return to search.
కోదండరాం అప్ గ్రేడెడ్ వెర్షన్ వస్తోంది
By: Tupaki Desk | 4 Oct 2016 5:30 PM GMT తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జేఏసీ చైర్మన్ కోదండరామ్ తన ఉద్యమ పంథాలకు మరింత పదును పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా తాజాగా సోషల్ మీడియాపై కన్నేశారు. జేఏసీ చేసే ఉద్యమాలు ప్రతి ఒక్కరికీ చేరాలన్న సంకల్పంతో ఆయన సోషల్ మీడియాలో తమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమంలో కూలీల దగ్గర నుంచి కులసంఘాల వరకు అందరినీ ఒక్కటి చేసిన ఘనత కోదండరామ్ దే. అందుకే, ఈసారి విద్యావంతులకు చేరువవ్వాలనుకుంటున్నారు. ఫేస్ బుక్ - ట్విట్టర్ - వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు మరింత వేగంగా చేరువవడం, వారి సమస్యలను తెలుసుకోవడం , వాటి ద్వారా వెనువెంటనే పోరాటాలకు దిగడం కోదండరామ్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే, ఆయన సోషల్ మీడియాను ఎంచుకున్నట్లు చెబుతున్నారు.
పలు వర్గాల్లో మంచి పట్టున్న కోదండరాం సోషల్ మీడియాలో యాక్టివ్ అయితే కొత్త ట్రెండును అందుకున్నట్లు అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఇబ్బందులు పడుతున్న ఆయన అప్ గ్రేడ్ వెర్షన్లా మళ్లీ తెలంగాణ రాజకీయ యవనికపై అడుగుపెట్టినట్లవుతుంది. ప్రస్తుతం నిత్యం సోషల్ మీడియాలో తలమునకలవుతున్న యువతను చేరుకోవాలంటే సోషల్ మీడియాలోంచే వెళ్లాల్సిన అవసరం ఉంది.
కోదండరాం ఈ ఏడాది కెనడా పర్యటన నుంచి రాగానే ప్రభుత్వ విధానాలపై పోరాటాలు మొదలు పెట్టారు. నయీం కేసు వెలుగుచూడనంత వరకు ప్రభుత్వానికి – జేఏసీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడిచింది. తెలంగాణ సాధించుకున్న తరువాత కూడా ప్రజల కష్టాలు తీరడం లేదని భావించిన ఆయన ఉద్యమబాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర కల నెరవేరాక కూడా యువత సమస్యలు తీరడం లేదన్నది ఆయన వాదన. అందుకే, దసరా తరువాత యువత ఉద్యోగాలు - సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలు - కాంట్రాక్టు - ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన పోరాడాలని ఆయన ముహూర్తం నిర్ణయించారు. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యచరణ కూడా రూపొందుతోంది. తాజాగా సోషల్ మీడియా దానికి తోడు కానుండడంతో కేసీఆర్ కు కోదండం చీకాకు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/