Begin typing your search above and press return to search.
కోదండరాం కొత్త కామెంట్లు విన్నారా?
By: Tupaki Desk | 30 Jun 2016 6:38 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై - రాష్ట్ర ప్రభుత్వంపై టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తన దాడిని పెంచారు. తెలంగాణలో విద్యావ్యవస్థ గాడిన పడేందుకు అంటూ సీఎం కేసీఆర్ చేపట్టిన విజిలెన్స్ తనిఖీలు వసూళ్ల కోసమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తను చెప్తున్న మాట కాదని అందరికీ ఈ విషయం తెలుసని వ్యాఖ్యానించారు.
విద్యావ్యవస్థను సంస్కరించాల్సిన ఆవశ్యకతమపై హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన సదస్సులో కోదండరాం మాట్లాడారు. కాలేజీలలో మౌళిక - బోధన ప్రమాణాల్లేవని, ఫీజు రీయింబర్స్ మెంట్ లో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ తనిఖీలు చేపట్టడం తాత్కాలిక ఉపశమనం కోసమేనని చెప్పారు. తనిఖీల కోసం ఏ వ్యవస్థను నియమించినా యాజమాన్యాల నుంచి ప్యాకెట్లు తీసుకొని వస్తున్నారని చెప్పారు. విజిలెన్స్ తనిఖీల వల్ల కొత్తగా వచ్చిన మార్పు ఏమీ లేదని, పర్యవేక్షణ అసలే లేదని అన్నారు. వసూళ్ల కోసమే విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయని, ఇది బహిరంగ రహస్యమేనని విమర్శించారు. అందుకే కాలేజీల మార్పుకోసం దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పర్యవేక్షణ వ్యవస్థను బలహీనం చేస్తే ప్రభుత్వ - ప్రయివేటు విద్య మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, కార్పొరేట్ విద్య శాసిస్తుందని అన్నారు.
డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల ప్రక్రియ గందరగోళంగా మారిందని కోదండరాం అన్నారు. డైట్ సెట్ నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కాలేజీలపై నియంత్రణ లేదని - ఆటస్థలం - ప్రయోగశాలలు లేకున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాలు - సీబీసీఎస్ - విజిలెన్స్ తనిఖీలు విశ్వవిద్యాలయాల ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయని కోదండరాం చెప్పారు. దీంతో విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి ప్రశ్నార్థకమని అన్నారు. పాఠశాలల హేతుబద్ధీకరణ - మూసివేత ఉమ్మడి పాలకులదనీ - విద్యార్థులు ఎందుకు చేరడం లేదో అధ్యయనం చేయాలని ఆయన సూచించారు.