Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై కోదండరాం డైరెక్ట్ అటాక్
By: Tupaki Desk | 16 Dec 2015 11:38 AM GMTతెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నంత పని చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగమవుతూనే అవకాశం వచ్చినపుడు ప్రభుత్వాన్ని నిలదీస్తానని ప్రకటించిన కోదండరాం తాజాగా కేసీఆర్ కు అత్యంత ప్రీతిపాత్రమైన రాజకీయ క్రీడను తప్పుపట్టారు. కేసీఆర్ భారీ స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పై కోదండరాం తనదైన శైలిలో కామెంట్లు చేశారు.
సుదీర్ఘకాలం తర్వాత జేఏసీ సమావేశం ఏర్పాటుచేసిన కోదండరాం తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు సహా రాష్ర్ట సమస్యలపై స్పందించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన... ఆత్మహత్యల నివారణకు కళాకారులు పాటు రాయాలని పిలుపునిచ్చారు. అప్పుల బాధతో సూసైడ్ చేసుకున్న వారిని కూడా ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. అన్ని ఉద్యోగాలు రెండు రాష్ట్రాలకే పరిమితమయ్యాయని - గ్రూడ్-డి - బ్యాంకు ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో మెలుగుతూ సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
పార్టీల మధ్య జరిగే రాజకీయ వివిదాల జోలికి తాము వెళ్లమని అంటూనే...ఫిరాయింపులపై ఘాటుగా స్పందించారు. ఏ రాజకీయ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినా అది తప్పేనని కోదండరాం పరోక్షంగా టీఆర్ ఎస్ కు కౌంటర్ వేశారు. పార్టీని వదిలి వెళ్లి పోవడంలాంటి అంశాలు అస్థిరతకు దారి తీస్తాయన్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ మినహా మరేపార్టీ ఆకర్షణల వలతో ఫిరాయింపుల జోలికి వెళ్లడం లేదనేది తెలిసిన విషయమే. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరాం ప్రజా సమస్యలపై స్పందించాల్సిన బాధ్యతతో పాటు రాజకీయ పరిణామాలపైనా నోరుమెదపాలని పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ఆయన కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.