Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ డైలాగ్‌ నే చెప్పిన కోదండ‌రాం

By:  Tupaki Desk   |   16 Oct 2016 6:45 AM GMT
ప‌వ‌న్ డైలాగ్‌ నే చెప్పిన కోదండ‌రాం
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం లు సేమ్ టోన్‌ లో సేమ్ డైలాగ్ వినిపించారు. తెలంగాణ‌లో నిర్మిస్తున్న మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టును నిర‌సిస్తూ కోదండ‌రాం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో నిర్మిస్తున్న ఆక్వా ఫుడ్ పార్క్ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ గ‌ళం వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ ఇద్ద‌రు నేత‌లు వామ‌ప‌క్ష నేత‌లు అధికారం కోల్పోయిన త‌ర్వాత ప‌శ్చిమ‌బెంగాల్ చేప‌ట్టిన ఆందోళ‌న‌ల‌ను ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ బెంగాల్‌ లోని నందిగ్రామ్ ఉద‌హ‌ర‌ణ‌ను ప్ర‌స్తావించ‌గా...కోదండ‌రాం సింగూరు ఆందోళ‌న‌న‌ను ఉద‌హ‌రించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న ఆక్వా ఫుడ్‌ పార్కును నిర‌సిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ను భీమవరం - నర్సాపూర్‌ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మత్స్య - రైతు కుటుంబాలకు చెందిన దాదాపు 50 మంది కలిసి తమ బాధలు వివరించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ స్పందిస్తూ...ఫుడ్ పార్క్‌ను తీర ప్రాంతానికి తరలించకుంటే మరో నందిగ్రామ్‌ ఉద్యమం తలెత్తుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామాల మధ్య ఈ పార్కును ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో తాగునీరంతా విష పూరితమవుతుందని - పర్యావరణం దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే దీన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమం చేయాల్సి వస్తుందని ఆయన స్పష్టంచేశారు. సంపద సృష్టించడం - ఉపాధి కల్పించడాన్ని తాను వ్యతిరేకించడం లేదని, అయితే ప్రజలకు ఇష్టంలేని ఆక్వా పార్కును అక్కడ ఏర్పాటు చేయవద్దనేదే తన అభిమతమని ప‌వ‌న్‌ స్పష్టంచేశారు. ఈ పార్కును తరలించకుంటే కులాల సమస్యగా మారుతుందని, ఇలాంటి అవకాశానికి ప్రభుత్వం తావివ్వరాదని ఆయన సూచించారు. స్థానిక ప్రజల ఆందోళన సామాజిక అంశంగా మారకముందే ప్రభుత్వం జోక్యం చేసుకుని పార్కును అక్కడినుంచి తరలించాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక జాతి దెబ్బతినేటప్పుడు ప్రజల్లో ఆవేశం వస్తుందని, ప్రభుత్వం ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి తగిన విధంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే దీన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమం చేయాల్సి వస్తుందని ప‌వ‌న్‌ స్పష్టంచేశారు.

సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములగాట్ గ్రామంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న 132 రోజుల రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడారు. బహుళ పంటలు పండే భూముల్లో ప్రాజెక్టులు నిర్మించవద్దనేది చట్టాల్లో ఉన్నా ప్రభుత్వం ఆ భూముల్లోనే ప్రాజెక్టు నిర్మించాలని సంకల్పించడం సరికాదని అన్నారు. ఒక‌వేళ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పశ్చిమ బెంగాల్‌ లోని సింగూరు ఫలితాలే మల్లన్నసాగర్‌ లో రావడం ఖాయమని కోదండ‌రాం చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం తప్పదనుకుంటే ప్రజాభీష్టంతో నిర్వాసితులకు భూమికి బదులుగా భూమి ఇచ్చి పునరావాసం కల్పించాకే, ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోదండ‌రాం డిమాండ్‌చేశారు. ఎత్తిపోతలతో భారీ ప్రాజెక్టులు నిర్మించడం వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ నిపుణులు చెపుతున్నా ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వద్దని ప్రజలు ఆందోళనలు చేస్తే వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసులు లాఠీచార్జీలు చేయించి, పికెటింగ్‌ లు ఏర్పాటు చేసి 144 సెక్షన్‌ ను అమలు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టిందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు డిపిఆర్ ఇంతవరకు లేదని, ఆలాంటిది ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోకుంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పరిస్థితిలాగే సుప్రీంకోర్టు తీర్పు మల్లన్నసాగర్ ప్రజలకు అనుకూలంగా రావడం ఖాయమన్నారు. వేములగాట్ ప్రజల పోరాటం అభినందనీయమన్నారు. ఇదే విధంగా సంఘటితంగా ఆందోళనలు చేస్తే తప్పక న్యాయం జరుగుతుందన్నారు. మొత్తంగా ఇద్ద‌రు నేత‌లు ప్ర‌జ‌ల ప‌క్షాన గ‌తంలో తాము మ‌ద్ద‌తిచ్చిన పార్టీల‌కు వ్య‌తిరేకంగా ఒకే టోన్‌తో విమ‌ర్శ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/